హెచ్ 1 బీ వీసాల జారీలో మోసాలు: వేటకు రెడీ అయిన ట్రంప్, చట్టసభకు సమాచారం  

USCIS took steps to prevent abuse, fraud in employment-based visa programs, USCIS, H1B visa - Telugu Fraud In Employment-based Visa Programs, H1b Visa, Uscis, Uscis Took Steps To Prevent Abuse

అమెరికాలో ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలన్నది ఎంతో మంది కల.వీరి ఆశను అవకాశంగా తీసుకుని కొందరు కేటుగాళ్లు వీసా, ఇమ్మిగ్రేషన్ సేవలు అందిస్తామంటూ మోసం చేసిన ఘటనలు కొకొల్లలు.

 Uscis Fraud In Employment Based Visa Programs H1b

అలాగే హెచ్ 1 బీ వీసాలు పొందే వారు సైతం ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.ఈ నేపథ్యంలో వీసాల జారీలో ఉన్న లోపాలను, మోసాలను అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం రంగంలోకి దిగింది.

వీసా విధానాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అమెరికా పౌరసత్వ, వలసల సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) పలు చర్యలు తీసుకుంటోంది.ఈ విషయాన్ని ట్రంప్ అధికార యంత్రాంగం అమెరికా చట్టసభ సభ్యులకు తెలిపింది.

హెచ్ 1 బీ వీసాల జారీలో మోసాలు: వేటకు రెడీ అయిన ట్రంప్, చట్టసభకు సమాచారం-Telugu NRI-Telugu Tollywood Photo Image

ప్రత్యేకించి ఉద్యోగ, ఉపాధి ఆధారిత వీసాల పద్ధతిలో లోపాలు ఉన్నాయని, వీటితో మోసాలకు అవకాశం వుందని యూఎస్‌సీఐఎస్ అభిప్రాయపడింది.అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకునే హెచ్ 1 బీ వీసాలపై పరిమితుల ఎంపిక ప్రక్రియలో మార్పులు చేపట్టినట్లు వివరించింది.

అమెరికాలో ఉద్యోగులకు, విద్యావంతులకు మేలు జరగాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే, అదే విధంగా అమెరికా కంపెనీలు వారి వ్యాపారాలకు నష్టం జరగకూడదనే ఆలోచనతోనే కొత్త వీసా విధానాలను చేపట్టినట్లు చట్టసభ సభ్యులకు ట్రంప్ అధికార యంత్రాంగం తెలిపింది.హెచ్ 1 బీ వీసాల ప్రక్రియలతో మోసాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించామని, వీటి కారణంగా అమెరికా దేశీయంగా పలు విధాలుగా దెబ్బ తింటోందని దీనిని నివారించేందుకు పలు చర్యలు చేపట్టినట్లు వివరించింది.

#H1b Visa #USCIS

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uscis Fraud In Employment Based Visa Programs H1b Related Telugu News,Photos/Pics,Images..