భారతీయ ఐటీ కంపెనీలకు షాక్: హెచ్-1బీ వీసా లిస్ట్ నుంచి తొలగింపు

హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్లకు ఫెడరల్ కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే యూఎస్‌ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఇండియన్ ఐటీ కంపెనీలకు షాకిచ్చింది.భారతీయ ఐటీ కంపెనీలను హెచ్-1బీ వీసాలు పొందే సంస్థల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

 Uscis Announces Indian It Companys Are From Applying H1b-TeluguStop.com

ఈ నిర్ణయంతో సదరు సంస్థలు హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం పోయింది.

యూఎస్‌సీఐఎస్ తాజా నివేదిక ప్రకారం అజిమెట్రీ ఇన్‌కార్పోరేషన్, నెటేజ్, బుల్‌మెన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇన్‌కార్పోరేషన్, బిజినెస్ రిపోర్టింగ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఇన్‌కార్పోరేషన్, కెవిన్ ఛాంబర్స్, ఇ యాప్పైర్ ఐటీ ఎల్ఎల్‌సీ లాంటి కంపెనీలు ఉన్నాయి.కొత్తగా హెచ్-1బీ వీసా కోసం వచ్చిన దరఖాస్తులను అమెరికా ప్రభుత్వం తిరస్కరించినట్లు యూఎస్‌సీఐఎస్ తెలిపింది.2015తో పోలిస్తే 2019లో తిరస్కరణకు గురైన హెచ్ఎస్‌సీఐఎస్ వీసాలు మూడు రెట్లు పెరిగాయి.వీటిలో 70 శాతం భారతీయులవే.

Telugu Hb, Telugu Nri Ups, Uscis-

హెచ్-1బీ వీసా దరఖాస్తులను ఆమోదించే విషయంలో యూఎస్‌సీఐఎస్ తన ప్రమాణాలను మార్చుకోవడమే తాజా నిబంధనలకు కారణమని ఇమ్మిగ్రేషన్ నిపుణులు భావిస్తున్నారు.కొద్దిరోజుల క్రితం అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే వారు ఆన్‌లైన్‌లో పది డాలర్ల నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాలని యూఎస్‌సీఐఎస్ కొత్తగా నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఇప్పుడు భారతీయ ఐటీ కంపెనీలకు హెచ్-1బీ వీసా నిబంధనల్ని కఠినతరం చేయడంతో అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న ఐటీ నిపుణులు కలవరపాటుకు గురవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube