అక్కడ బాహుబలి తరువాత చిరంజీవిదే రికార్డు   USA Premiers : Megastar Sets New Non-Baahubali Record     2017-01-11   09:51:33  IST  Raghu V

మెగాస్టార్ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ, ఓవర్సీస్ ప్రీమియర్స్ లో జయకేతనం ఎగురవేశారు. అరమిలియన్ కి పైగా చేస్తుందేమో అని అందరు అంచనా వేస్తె, అమెరికా ప్రిమియర్స్ ని ఏకంగా మిలియన్ మార్కు దాటించాడు ఖైది నం 150. మొదట బాహుబలిని దాటేసేలా ఉండింది స్పీడు. ఆ తరువాతే కాస్త నేమ్మదించి, బాహుబలి దగ్గరలో ఆగింది. అంటే అమెరికా ప్రీమియర్స్ కలెక్షన్లలో బాహుబలి తరువాతి రికార్డు చిరంజీవిదే అన్నమాట. $616k సాధించిన సర్దార్ గబ్బర్ సింగ్ కి డబుల్ వసూలు చేస్తూ, 1.25 మిలియన్ డాలర్ల గ్రాస్ సాధించింది ఖైది నం 150.

మీకోసం టాప్ 5 అమెరికా ప్రీమియర్ కలెక్షన్లు :

బాహుబలి : $1.38M
ఖైది నం 150 : $1.25M
సర్దార్ గబ్బర్ సింగ్ : $616K
జనత గ్యారేజ్ : $584K
బ్రహ్మోత్సవం : $100%K

అయితే ఆలిండియా రికార్డు మాత్రం రజినీకాంత్ పేరు మీదే ఉంది. కబాలి అమెరికా ప్రీమియర్స్ నుంచి ఏకంగా $1.92M వసూలు చేసింది.