అది మెగాస్టార్ స్టామినా కాదు .. ఆఫర్ మహిమ   USA Premier Collection Is Not Megastar’s Stamina     2017-01-11   21:13:11  IST  Raghu V

అమెరికా ప్రిమియర్స్ $500k దాటితే చాలు అని యూనిట్ మాత్రమే కాదు, మెగా వీరాభిమానులు కూడా అనుకోని ఉంటారు. కాని ఖైదీనం 150 $1.25 మిలియన్ డాలర్లుకి పైగా రాబట్టింది ప్రీమియర్స్ ద్వారా. అంతా అబ్బో మెగాస్టార్ .. మహేష్, పవన్, ఎన్టీఆర్ కి పోటి ఇస్తే చాలు అనుకున్నాం కాని, వాళ్ళకంటే డబుల్ ఫిగర్స్ కొట్టాడుగా అని సంబరపడుతున్న సమయంలోనే అసలు విషయం బయటపడింది.

ఈ ప్రీమియర్స్ కలెక్షన్స్ పూర్తిగా మెగాస్టార్ స్టామినా కాదు. అమెరికాలో మంగళవారం నాడు టీమొబైల్ టికెట్ రేట్లపై భారి డిస్కౌంట్ ని అందజేసింది. $25 డాలర్లు చెల్లించి ఖైదీనం 150 టికేట్ కొంటే, యూజర్ కి ఏకంగా $23 డాలర్లు తిరిగివచ్చాయి. అంటే, చవకగా $2 ఖర్చు ప్రేక్షకుడికి పడి, సినిమా కలెక్షన్లో మాత్రం $25 పడ్డాయన్నామాట.

ఈ లాభం కేవలం ఖైదీకే దక్కలేదు. 20 రోజులు దాటిన ఆమీర్ ఖాన్ దంగల్ కూడా మంగళవారం నాడు లక్ష మూడు వేల డాలర్లు వసూలు చేసింది. చేస్తే ఏంటి అని అంటారా .. అదే సోమవారం దంగల్ ముప్ఫై నాలుగు వేల డాలర్లు వసూలు చేసింది. ఇన్నిరోజుల తరువాత, ఎలాంటి సెలవు లేకుండా సోమవారం కలెక్షన్ కి మంగళవారం అంత పెద్ద తేడా ఎందుకు వచ్చింది? టీమొబైల్ ఆఫర్ వల్లే.

$25-$27 టికేట్ కొంటే, $23-$25 డాలర్లు వెనక్కి వస్తే ఎవరు మాత్రం ఎగబడరు .. వచ్చిన $1.25M లో, ఈ ఆఫర్ మీద ఖైదీనం 150 ఏకంగా $700-$800K పోగేసిందట.