ఇలాంటి డ్రైవింగ్ లైసెన్స్ ని మీరు ఎప్పడైనా చూశారా ?

కొన్ని ఘటనలు చాలా వింతగా ఉంటాయి.ఆ ఘటనల గురించి తెలిశాక ఏంటి మిస్టరీ అనుకుంటారు.

 Us Woman Receives Driving License With Photo Of Empty Chair,us Woman, Driving Li-TeluguStop.com

కాని అక్కడ నిజం తెలిస్తే సోది ఘటన అని అనిపిస్తుంది.ఇంకా అచ్చం అలాంటి ఘటనే అమెరికాలోని టెనేస్సీలో చోటు చేసుకుంది.

అసలు ఏమైందంటే? జాడే డాడ్‌ అనే మహిళ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించి రెన్యువల్‌కి అప్లై చేశారు.

సరిగ్గా వారం రోజులకు ఆమెకు పోస్టు ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికి వచ్చింది.

అది చుసిన ఆ మహిళ ఒక్కసారిగా షాక్ కి గురైంది.ఎందుకు అంటే ఆ డ్రైవింగ్ లైసెన్స్ పై ఆమె ఫోటో లేదు కేవలం కుర్చీ మాత్రమే ఉంది.

దీంతో వెంటనే ఆమె ఆర్‌టీఏ ఆఫీసుకు ఈ విషయంపై మెయిల్ చెయ్యగా వారు ఫోన్ చేసి షాకింగ్ విషయం చెప్పారు.

దీంతో ఆమె పంపిన ఫోటో చూసి షాక్ అయ్యింది.

ఎందుకంటే ఆమె ఫోటో పంపించబోయే సమయంలో తన ఫోటో బదులుగా కుర్చీ మాత్రమే ఉన్న ఫోటోను పంపించింది. ఆర్‌టీఏ సిబ్బంది కూడా ఆమె ఫోటో చూడకుండానే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు.

అయితే ఇది తెలుసుకున్న ఆమె మరోసారి సరైన ఫోటో పంపించగా ఈసారి ఆమె ఫోటోనే డ్రైవింగ్ లైసెన్స్ పై వచ్చింది.అయితే ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube