స్ట్రెయిన్ భయం: అమెరికాకు రావాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..!!

బ్రిటన్‌లో పుట్టిన కోవిడ్ స్ట్రెయిన్ ప్రస్తుతం ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది.చాప కింద నీరులా విస్తరిస్తూ కొత్త టెన్షన్ పెడుతోంది.

 Us Will Require Negative Covid19 Results From All Incoming Travelers, Covid Stra-TeluguStop.com

కోవిడ్ భయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్న ప్రపంచదేశాలకు కొత్త రకం వైరస్ నిద్రలేకుండా చేస్తోంది.ఇది విస్తరించకుండా పలు దేశాలు యూకే‌ నుంచి, యూకే మీదుగా విమాన సర్వీసుల్ని నిషేధించాయి.

తప్పనిసరి పరిస్ధితుల్లో ఎవరైనా రావాలంటే సవాలక్షా కండిషన్లు పెడుతున్నాయి.మనదేశం కూడా యూకే ప్రయాణాల్ని తొలుత నిషేధించినప్పటికీ తర్వాత పాక్షికంగా సర్వీసుల్ని పునరుద్ధరించింది.

తాజాగా అమెరికా అంతర్జాతీయ ప్రయాణికులపై ఇప్పటికే వున్న ఆంక్షల్ని పొడిగించేందుకు సిద్ధమవుతోంది.

తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు అమెరికా విమానం ఎక్కేముందు కచ్చితంగా కరోనా నెగటివ్‌ సర్టిఫికేట్ చూపిస్తేనే అనుమతిచ్చే దిశగా చర్యలు చేపడుతోంది.

ఈ మేరకు యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం జనవరి 26 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రావచ్చని కథనాలు వస్తున్నాయి.

ఇప్పటికే సీడీసీ, ఇతర అధికార యంత్రాంగం దీనిపై కసరత్తు చేస్తోంది.ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులతో పాటు, విదేశాలకు వెళ్లి స్వదేశానికి తిరిగిరానున్న అమెరికన్లకు కూడా ఇది వర్తించనుంది.

Telugu Corona, Covid Strain, Type, Control Cdc-Telugu NRI

కాగా, అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది.రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతున్నాయి.ఇప్పటికే కొవిడ్ మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో 4 వేల మార్క్‌ను దాటగా.మంగళవారం 4,470 మరణాలు నమోదయ్యాయి.2,35,000 కొత్త కేసులు రికార్డయ్యాయి.కరోనా బారినపడ్డ జనం ఆస్పత్రులకు క్యూ కడుతుండటంతో వైద్యశాలలు కిక్కిరిసిపోతున్నాయి.

చాలా మందికి బెడ్స్, వైద్య సదుపాయాలు అందడంలేదు.దీంతో అత్యవసర రోగులకు కార్లు, అంబులెన్స్‌లలో ఉంచే చికిత్స అందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube