ఇరాన్‌కు మేలు కలిగేలా వ్యాపారం.. భారతీయ కంపెనీపై అమెరికా కన్నెర్ర

ఇరాన్ పెట్రో కెమికల్స్ , పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించే అంతర్జాతీయ నెట్‌వర్క్ కంపెనీలపై అమెరికా కొరడా ఝళిపించింది.ఇందులో భాగంగా ఇరాన్ బ్రోకర్లు, యూఏఈ, హాంకాంగ్, భారత్‌కు చెందిన పలు కంపెనీలపై తాజాగా ఆంక్షలను విధించింది.

 Us Treasury Department Sanctions India-based Petrochemical Company Over Iran Con-TeluguStop.com

ఈ కంపెనీలన్నీ నగదు బదిలీలు, ఇరాన్ పెట్రోలియం, పెట్రో కెమికల్ ఉత్పత్తుల రవాణాను సులభతరం చేయడంలో కీలకపాత్ర పోషించాయి.భారత్‌ నుంచి కార్యకలాపాలు సాగిస్తోన్న ‘‘ Tibalaji Petrochem Private Limitedఅనే భారతీయ పెట్రో కెమికల్ కంపెనీ.

చైనాకు షిప్పింగ్ కోసం ట్రిలయన్స్ ద్వారా ఏర్పాటు చేసిన బేస్ ఆయిల్, మిథనాల్ వంటి పెట్రో కెమికల్ పదార్థాలను కొనుగోలు చేసిందని అమెరికా ప్రభుత్వం పేర్కొంది.ఇరాన్ చట్ట విరుద్ధమైన చమురు, పెట్రో కెమికల్ అమ్మకాలను పరిమితం చేసేందుకు అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే.

జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీవోఏ) పూర్తి అమలును ఇరాన్ తిరస్కరించినంత కాలం ఆ దేశ పెట్రోలియం, పెట్రో కెమికల్ ఉత్పత్తుల అమ్మకాలపై యునైటెడ్ స్టేట్స్ తన ఆంక్షలను అమలు చేస్తూనే వుంటుందని యూఎస్ ట్రెజరీ ఫర్ టెర్రరిజం అండ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అండర్ సెక్రటరీ బ్రియాన్ ఈ నెల్సన్ తెలిపారు.

ఇరాన్ పెట్రోలియం, పెట్రో కెమికల్ పరిశ్రమలలో కీలకమైనది ట్రిలయన్స్.

ఇది ఇరాన్ వస్తువులను విదేశీ వినియోగదారులకు విక్రయించడాన్ని సులభతరం చేస్తుంది.అలాగే ఇరాన్‌లోని పెట్రోకెమికల్ బ్రోకర్ల నుంచి మిలియన్ డాలర్ల విలువైన పెట్రో కెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేసి.

వాటిని భారతదేశానికి రవాణా చేసిందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.ఇరాన్ ఎగుమతుల మూలాన్ని దాచిపెట్టడంతో పాటు మరికొన్ని అంశాల్లో ఈ సంస్థలు కీలకపాత్ర పోషించాయని యూఎస్ ట్రెజరీ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

Telugu America, Brian Nelson, India, Iran Petroleum, Russia, Ukraine, Treasury-T

జేసీపీవోఏని ఉల్లంఘిస్తూ ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందున .ఇరాన్ పెట్రోలియం, పెట్రో కెమికల్స్ అమ్మకాలపై ఆంక్షల అమలును వేగవంతం చేయడం కొనసాగుతుందని యూఎస్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ, అస్థిర కార్యకలాపాలకు మద్ధతుగా తన అణు కార్యక్రమం, డ్రోన్‌ల వినియోగం, సైనిక శిక్షణతో సహా అనేక రకాలైన ఇరాన్ విధానాల గురించి తాము ఆందోళన చెందుతున్నామని అమెరికా ప్రభుత్వం పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube