యూఎస్‌లో టాలీవుడ్‌ సెక్స్‌ రాకెట్‌.. రోజుకో నిజం       2018-06-16   03:51:15  IST  Raghu V

తెలుగు సినిమా తారలతో అమెరికాలో వ్యభిచారం చేయిస్తున్న కిషన్‌ మరియు ఆయన భార్య చంద్రలను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులు కిషన్‌ మరియు చంద్రలను ఎంక్వౌరీ చేస్తున్నారు. ఈ సమయంలోనే పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కిషన్‌ పదుల సంఖ్యలో హీరోయిన్స్‌తో అమెరికాలో వ్యభిచారం చేయించాడు అంటూ విచారణలో వెళ్లడి అయ్యింది. ఆ హీరోయిన్స్‌ పేర్లు బయటకు రానప్పటికి వారితో ఎలా, ఎప్పుడు వ్యభిచారం చేయించాడు అనే విషయాలు వెళ్లడి అవుతున్నాయి. తాజాగా కిషన్‌ ఇంట్లో రెండు డైరీలు పోలీసులు గుర్తించారు.

ఆ డైరీల్లో తెలుగులో రాసి ఉన్న విషయాన్ని పోలీసులు తెలుగు తెసిని వారితో తర్జమా చేయించారట. ఆ విషయాన్ని కూడా విచారణ అధికారి చెప్పుకొచ్చాడు. తెలుగులో వారు రాసిన దాన్ని తర్జమా చేయించిన తర్వాత షాక్‌కు గురయ్యామని, ఏ హీరోయిన్‌ వద్దకు ఎవరిని పంపించారు, ఎవరికి ఎంత ఇచ్చారు అంటూ అందులో నమోదు చేయడం జరిగింది. కిషన్‌ పలువురు హీరోయిన్స్‌ను అమెరికాకు రప్పించేందుకు పలు మోసాలు చేశాడు అంటూ కూడా విచారణలో వెళ్లడి అయ్యింది.

అక్కడ తెలుగు సంఘాల పేర్లతో నకిలి లెటర్‌ హెడ్‌ను సృష్టించి, వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హీరోయిన్స్‌ను ఆహ్వానిస్తున్నట్లుగా గుర్తించారు. పలు తెలుగు సంఘాల వారితో ఈ విషయాన్ని చర్చించినప్పుడు తాము ఆయా తేదీల్లో కార్యక్రమాలను నిర్వహించేలేదు, అసలు ఆ హీరోయిన్స్‌ను తాము అమెరికాకు రప్పించలేదు అంటూ చెప్పుకోచ్చారు. ఇలా పలు ఆసక్తికర విషయాలు వెళ్లడవుతున్న నేపథ్యంలో కిషన్‌ ఎంత పకడ్బందీగా ఈ వ్యవహారంను నడిపించాడో అర్థం అవుతుంది.

తెలుగు హీరోయిన్స్‌ కిషన్‌ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ మరియు సినిమా నిర్మాతల మండలి హెచ్చరించింది. అమెరికా నుండి పిలుపు వస్తే ఖచ్చితంగా మా కు సమాచారం అందించాల్సిందే అంటూ మా అధ్యక్షుడు శివాజీ రాజా అందరికి మెసేజ్‌లు పంపించడం జరిగింది. మా కు చెందిన సభ్యులు అమెరికా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇన్ఫర్మెషన్‌ ఇవ్వనట్లయితే వారికి అక్కడ జరిగే పరిణామాలకు తెలుగు సినిమా పరిశ్రమ బాధ్యత వహించదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక కిషన్‌ నిర్మాత అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే కిషన్‌కు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధం లేదని, అసలు ఇండస్ట్రీలో ఆయన ఎప్పుడు కలవలేదు అంటూ నిర్మాతల మండలి క్లారిటీ ఇచ్చింది.