1939 నాటి పెయింటింగ్.. హక్కుల కోసం న్యాయ పోరాటం, యూఎస్ సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ

1939 ప్రాంతంలో నాజీలు దోచుకోగా.ప్రస్తుతం స్పెయిన్‌లోని ఒక గ్యాలరీలో ప్రదర్శనకు వున్న కామిల్లె పిస్సార్రో పెయింటింగ్‌ భవితను యూఎస్ సుప్రీంకోర్ట్ నిర్ణయించనుంది.1897 నాటి ఈ పెయింటింగ్ అంతర్జాతీయ పరిణామాలతో కూడిన సుదీర్ఘ న్యాయ పోరాటానికి కేంద్రంగా వుందని సుప్రీం వ్యాఖ్యానించింది.జర్మన్ యూదు కుటుంబానికి చెందిన లిల్లీ కాసిరర్ న్యూబౌర్ ఆధీనంలో ఈ పెయింటింగ్ వుండేదట.ప్రస్తుతం దీని విలువ దాదాపు 30 మిలియన్ డాలర్లు వుంటుందని అంచనా.1939లో జర్మనీని విడిచి వెళ్లేందుకు అనుమతించే వీసాను ఇచ్చేందుకు గాను న్యూబౌర్ దానిని నాజీలకు స్వల్ప ధరకు అప్పగించాల్సి వచ్చింది.

 Us Supreme Court To Determine Fate Of $30 Mn Pissarro Painting Looted By Nazis,p-TeluguStop.com

అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత న్యూబౌర్ కుటుంబం ఈ పెయింటింగ్‌ను కోల్పోయినట్లుగా తెలుస్తోంది.1958లో జర్మన్ ప్రభుత్వం 13,000 డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లిస్తామని తెలిపింది.కాగా.మాడ్రిడ్‌లోని థైసెన్- బోర్నెమిస్జా మ్యూజియంలో చేరడానికి ముందు ఈ పెయింటింగ్ పలువురి చేతులు మారినట్లు రికార్డులు చెబుతున్నాయి.అయితే దీనిని 1976లో న్యూయార్క్‌లోని స్టీఫెన్ హాన్ గ్యాలరీ నుంచి థైసెన్ ఇండస్ట్రియల్ గ్రూప్ వారసుడు బారన్ హాన్స్ హెన్రిచ్ థైసెన్ బోర్నెమిస్జా కొనుగోలు చేశారు.అయితే న్యూబౌర్ మనవడు క్లౌడ్ కాసిరర్.2000వ సంవత్సరంలో ఈ పెయింటింగ్ మాడ్రిడ్‌లో వుందని కనుగొన్నాడు.దానిని తిరిగి పొందేందుకు స్పెయిన్, కాలిఫోర్నియా ప్రభుత్వాలతో చట్టపరమైన ప్రయత్నాలను ప్రారంభించాడు.

ఇది జరుగుతూ వుండగానే 2010లో 89 సంవత్సరాల వయసులో క్యాసిరర్ కన్నుమూశారు.ఆయన మరణించినా క్యాసిరర్ పిల్లలు డేవిడ్, అనాలు పోరాటాన్ని కొనసాగించారు.అయితే స్పెయిన్, కాలిఫోర్నియా కోర్టులలో ప్రతికూల ఫలితం రావడంతో సుప్రీంకోర్ట్ తీర్పుపై వారిద్దరూ ఆశ పెట్టుకున్నారు.ఈ కేసులో వర్తించేది స్పానిష్ చట్టమా లేక యూఎస్ చట్టమా అనేది సుప్రీం తేల్చనుంది.

యూఎస్ కాంగ్రెస్ నివేదిక ప్రకారం.నాజీలు ఐరోపాలో దాదాపు 6,0,000 కళాకృతులను దోచుకున్నారని అంచనా.

అట్లాంటిక్‌కు ఇరువైపులా వున్న న్యాయస్థానాలు వాటి అసలు యజమానులకు వస్తువులను అప్పగించే కేసులను తప్పకుండా విచారిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

US Supreme Court to determine fate of Pissarro painting Looted by Nazis

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube