కోర్టులో మళ్లీ చుక్కెదురు: ట్రంప్‌కు అన్నిదారులు మూసుకుపోయినట్లేనా..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించక మొండిగా వాదిస్తున్నారు.కౌంటింగ్ నాటి నుంచే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వరుసగా కోర్టు మెట్లెక్కుతున్నారు.

 Us Supreme Court Rejects Republican Attack On Biden Victory, Donald Trump, Texas-TeluguStop.com

న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు.అయితే, ఇప్పటివరకు ప్రతిచోట ట్రంప్‌కు పరాభవమే ఎదురైంది.

కానీ ఫెడరల్ సుప్రీంకోర్టు ఆయన పిటిషన్లను కనీసం విచారించడానికి కూడా సుముఖత వ్యక్తం చేయకపోవడం గమనార్హం.తాజాగా ట్రంప్ తరుఫున టెక్సాస్‌ అటార్నీ జనరల్ కెన్ పాక్ట్‌సన్ (రిపబ్లికన్ పార్టీ) వేసిన దావాను సైతం సుప్రీం తిరస్కరించింది.

జో బైడెన్ విజయం సాధించిన టెక్సాస్‌లో బ్యాలెట్ ఓట్లలో అవకతవకలు జరిగాయని శుక్రవారం అటార్నీ దావా వేశారు.కానీ, ట్రంప్ ఆరోపిస్తున్నట్లు ఏమీ జరగలేదని, ఎన్నికలు న్యాయంగానే జరిగాయంటూ ఈ పిటిషన్‌ను విచారించకుండానే న్యాయస్థానం తిరస్కరించింది.

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ న్యాయపరంగా జరిగాయని గుర్తించలేని స్థితిలో టెక్సాస్‌ ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.మరొకరి ఓటింగ్‌ ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి ఏ రాష్ట్రానికి చట్టపరమైన హక్కులేదు.

అయినప్పటికీ ఈ పిటిషన్‌కు 106 మంది రిపబ్లికన్‌ ఎంపిలు, 17 రాష్ట్రాల అటార్నీ జనరల్‌ మద్దతునివ్వడం గమనార్హం.

Telugu Donald Trump, Joe Biden, Joebiden, Republican Mp, Republican, Texasgenera

ఇంత జరుగుతున్నా కూడా ట్రంప్‌ తన ఓటమిని అంగీకరించడం లేదు.సుప్రీంలో తీర్పు రావడానికి ముందు కూడా ఓ టివి చానల్‌లో మాట్లాడుతూ.ఎన్నికలు దోపిడీకి గురయ్యాయని, ఇది దౌర్జన్యమని అంటూ.

కావాలంటే తమ మద్దతుదారులు, ఎంపిలను కలవాలంటూ వ్యాఖ్యానించారు.మరోవైపు తాజా సుప్రీం కోర్టు తీర్పుతో ఫలితాలను అడ్డుకోవడానికి ట్రంప్‌ ముందున్న అన్ని ద్వారాలూ మూసుకుపోయాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సోమవారం ఎలక్టోరల్‌ కాలేజీ సమావేశమై తదుపరి అధ్యక్షుణ్ని ఎన్నుకోనుంది.అన్నీ సజావుగా సాగితే జో బైడెన్‌ ఎంపిక లాంఛనమే.

నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ 306 ఎలక్ట్రోరల్ ఓట్లు పొంది ఘన విజయం సాధించగా.ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ 232 ఓట్లు మాత్రమే సాధించారు.

అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (270) కంటే బైడెన్ 36 ఎలక్ట్రోరల్ ఓట్లు ఎక్కువగా సాధించడం విశేషం.చిన్న పాటి సాంకేతిక ప్రక్రియలు మినహా జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం లాంఛనమే.

అమెరికా 46వ అధ్యక్షుడిగా వచ్చే ఏడాది జనవరి 20న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube