అది భారత చరిత్రలో ‘‘చీకటి సంవత్సరం’’.. 1984 సిక్కు అల్లర్లపై అమెరికన్ సెనేటర్ వ్యాఖ్యలు

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు ఆధునిక భారత చరిత్రలో ‘‘చీకటి సంవత్సరం’’ అని వ్యాఖ్యానించారు అమెరికన్ సెనేటర్, అమెరికన్ సిక్కు కాంగ్రెషనల్ కాకస్ సెభ్యుడు పాట్ టూమీ. సెనేట్ ఫ్లోర్‌లో ఆయన మాట్లాడుతూ.

 Us Senator Pat Toomey Comments On 1984 Anti-sikh Riots,us Senator Pat Toomey,ant-TeluguStop.com

భారత్‌లోని జాతుల మధ్య చోటు చేసుకున్న అనేక హింసాత్మక సంఘటనలను ఈ ప్రపంచం చూసిందన్నారు.వీటిలో సిక్కు అల్లర్లు కూడా ఒకటని పాట్ వ్యాఖ్యానించారు.

పంజాబ్ ప్రావిన్స్‌లోని సిక్కులు .భారత్‌లోని కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేశారని ఆయన గుర్తుచేశారు.1984 నవంబర్‌లో భారత్ వ్యాప్తంగా దాదాపు 3000 మందికిపైగా సిక్కు పురుషులు, మహిళలు, పిల్లలను ఊచకోత కోయడంతో పాటు లెక్కలేనన్ని అత్యాచారాలు జరిగాయని పాట్ వెల్లడించారు.

భవిష్యత్తులో మానవ హక్కుల ఉల్లంఘనలను నివారించడానికి.

వాటి గత రూపాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం వుందన్నారు.ఈ తరహా విషాదం ప్రపంచవ్యాప్తంగా వున్న సిక్కు సమాజం, ఇతర వర్గాలపై పునరావృతం కాకుండా చూసుకోవాలని టూమీ పేర్కొన్నారు.

సిక్కు మతం ఆవిర్భవించిన 600 ఏళ్ల చరిత్రను గమనిస్తే.ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల మంది ఈ మతాన్ని అనుసరిస్తున్నారని, అమెరికాలో 7 లక్షల మంది ఆచరిస్తున్నారని ఆయన తెలిపారు .చారిత్రాత్మకంగా సిక్కులు అన్ని మత, సాంస్కృతిక, జాతి నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులకు సేవ చేయడానికి నిబద్ధతను ప్రదర్శించారని టూమీ ప్రశంసించారు.అమెరికాలో కోవిడ్ 19 మహమ్మారి విజృంభించిన సమయంలో పెన్సిల్వేనియాతో పాటు దేశవ్యాప్తంగా అనేక సిక్కు సంఘాలు జాతి, లింగం, మతంతో సంబంధం లేకుండా సాయం చేశాయని ఆయన గుర్తుచేశారు.

కాగా.1984 అక్టోబరు 31న అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీని.ఆమె బాడీగార్డులైన సత్వంత్‌ సింగ్‌, బీయాంత్‌ సింగ్‌ కాల్చి చంపారు.ఇందిర హత్యతో దేశం ఉడికిపోయింది.

ఈ హత్యకు ప్రతీకారంగా పలు చోట్ల సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి.దేశ రాజధాని ఢిల్లీతో పాటు చాలా ప్రాంతాల్లో సిక్కులను ఊచకోత కోశారు.

ఆస్తుల ధ్వంసం, మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దోపిడిలతో అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి.ఈ అల్లర్లలో దాదాపు 2800 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక లెక్కలు చెబుతున్నా.

ఈ సంఖ్య భారీగానే వుంటుందని అంచనా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube