అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా: నామినేషన్ ఆమోదానికి విఘ్నాలు... రంగంలోకి సెనేట్

అసోసియేట్ అటార్నీ జనరల్‌గా భారత సంతతికి చెందిన న్యాయవాది వనితా గుప్తాను అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.ఆమె నియామకానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేయాల్సి వుంది.

 Us Senate To Vote On Indian-american Lawyer Vanita Guptas Nomination, Vanitha Gu-TeluguStop.com

ఇందుకోసం సెనేట్ అరుదైన విధానాన్ని అనుసరిస్తుందని ఓ చట్టసభ సభ్యుడు తెలిపారు.సెనేట్‌లో ఈ నామినేషన్‌కు ఆమోదం లభిస్తే.

అసోసియేట్ అటార్నీ జనరల్‌గా పనిచేసిన మొదటి మహిళగా 46 ఏళ్ల వనితా గుప్తా చరిత్ర సృష్టిస్తారు.ఇది అమెరికా న్యాయశాఖలో మూడవ అత్యున్నత పదవి.

సెనేట్ జ్యూడీషియరి కమీటీ ఆమె నామినేషన్‌కు మార్చి 25న 11-11 ఓట్లు వేసింది.అయితే దీనిని సెనేట్‌లో పూర్తి స్థాయి ఓటింగ్‌కు అనుమతించాలని కోరుతూ సెనేట్‌లో మెజారిటీ నేత చుక్ ష్కుమెర్ అరుదైన డిశ్చార్జ్ మోషన్ దాఖలు చేశారు.

జ్యూడీషియరీ కమిటీ నుంచి వనితా గుప్తా నామినేషన్‌ను ఉపసంహరించడానికి సెనేట్ ఈ అరుదైన విధానాన్ని అనుసరించనుంది.100 మంది సభ్యులున్న సెనేట్‌లో రిపబ్లికన్లు, డెమొక్రాట్ల బలం సరిసమానం.దీంతో ఓటింగ్‌లో నెగ్గేందుకు గాను అధికార పార్టీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌పై ఆధారపడింది.ఆ తర్వాత రోజు ష్కుమెర్ ఎగ్జిక్యూటివ్ సెషన్‌కు వెళ్లడానికి మరో మోషన్ దాఖలు చేస్తారు.

జ్యూడీషియరీ కమిటీ నుంచి గుప్తా నామినేషన్‌ను విడుదల చేయాలనే మోషన్‌పై నాలుగు గంటల పాటు చర్చ జరుగుతుంది.అనంతరం సెనేట్ రోల్ కాల్ ఓటుకు వెళుతుంది.మరోవైపు పలువురు ప్రముఖులు కూడా వనితా గుప్తా నామినేషన్‌ను ధ్రువీకరించాలని సెనేట్‌ను కోరారు.ప్రస్తుత క్లిష్ట పరిస్ధితుల్లో వనితా గుప్తా మనదేశాకి అవసరమని.

నిరాధారమైన, హానికరమైన పక్షపాతానికి ఇప్పుడు సమయం కాదని లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ సీఈవో హెండర్సన్ అన్నారు.పౌరహక్కులు, న్యాయ వ్యవస్థపై ఆమెకు వున్న అనుభవం దేశానికి అవసరమని ఆయన స్పష్టం చేశారు.

అందువల్ల సెనేట్ వనితా గుప్తా నియామకాన్ని ధ్రువీకరించేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని హెండర్సన్ విజ్ఞప్తి చేశారు.

Telugu Barack Obama, Joe Biden, Kamala, Vanitha Guptha-Telugu NRI

వనిత తల్లిదండ్రులది ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌.తండ్రి రాజీవ్‌ గుప్తా, తల్లి కమల వర్షిణి.రాజీవ్‌ బిజినెస్‌మ్యాన్‌.ఎం.బి.ఎ.చదివింది అమెరికాలోనే అవడంతో ఫిలడెల్ఫియాలో స్థిరపడ్డారు.భారత్‌లో ఉన్నప్పుడే 1968 లో వారి వివాహం జరిగింది.1974లో ఫిలడెల్ఫియాలో వనితా గుప్తా జన్మించారు.వనిత మొదట ఎన్‌ఏఏసీపీ లీగల్ డిఫెన్స్‌ ఫండ్‌లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.ఆ తరవాత అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌లో విధులు నిర్వర్తించారు.అనంతరం బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో న్యాయ శాఖలోని పౌర హక్కుల విభాగానికి నాయకత్వం వహించారు.గత పదిహేడేళ్లుగా వనిత విజయాలలో ఆమె భర్త ఛిన్‌ క్యు లె సహకారం కూడా ఉంది.2003లో వారి వివాహం జరిగింది.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube