నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా భారత సంతతి మహిళ.. బైడెన్ నిర్ణయానికి సెనేట్ ఆమోదం

భారత సంతతికి చెందిన రాజకీయ కార్యకర్త షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌ను నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా నామినేట్ చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయానికి యూఎస్ సెనేట్ ఆమోదముద్ర వేసింది.తాను భారత్‌లో జన్మించినప్పటికీ.

 Us Senate Confirms Indian-origin Shefali Razdan Duggal As America's Ambassador T-TeluguStop.com

అమెరికాలోనే పెరిగానని ఈ ఏడాది జూలైలో సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ సభ్యులతో ఆమె చెప్పారు.మనదేశంలో దయ, సానుభూతి, నిజాయితీ, సమానత్వంపై తనకు పూర్తి విశ్వాసం వుందన్నారు.

ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు మనల్ని అదే దృక్కోణంలో చూస్తున్నారని షెఫాలీ పేర్కొన్నారు.తన కథ ప్రత్యేకమైనది కాదని.

కానీ అమెరికన్ స్పిరిట్, అమెరికన్ డ్రీమ్‌లను సూచిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

కాశ్మీరీ పండిట్ అయిన షెఫాలీ రజ్దాన్ దుగ్గల్ (50) హరిద్వార్‌లో జన్మించారు.రెండేళ్ల వయసులోనే ఆమె తన కుటుంబంతో అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌కు వలస వెళ్లారు.షెఫాలీ… డెమొక్రాట్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.దక్షిణాసియా అమెరికన్లు మరింత వృద్ధిలోకి రావడానికి దుగ్గల్ స్పూర్తిగా నిలిచారని ప్రశంసించారు కమ్యూనిటీ నేత అజయ్ జైన్.నెదర్లాండ్స్‌కు తదుపరి అమెరికా రాయబారిగా షెఫాలీ నియామకం దక్షిణాసియా వాసులకు, ముఖ్యంగా భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి గర్వకారణమన్నారు.

Telugu Democrat, Haridwar, Joe Biden, Netherlands, Shefalirazdan, Senate, Wester

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన షెఫాలీ రాజకీయ కార్యకర్త , మహిళా హక్కుల న్యాయవాది, మానవ హక్కుల ప్రచారకర్త అని వైట్‌హౌస్ తెలిపింది.ఆమె యునైటెడ్ స్టేట్స్ హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియం కౌన్సిల్‌కు అధ్యక్షురాలిగా పనిచేశారు.ప్రస్తుతం వెస్ట్రన్ రీజినల్ అడ్వైజర్‌‌గా కొనసాగుతున్నారు.హ్యూమన్ రైట్స్ వాచ్ శానిఫ్రాన్సిస్కో కమిటీ, వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ లీడర్‌షిప్ అండ్ క్యారెక్టర్ కౌన్సిల్‌ సభ్యురాలిగా పనిచేశారు.న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ కమ్యూనికేషన్‌లో ఎంఏ .మియామీ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ కూడా చదివారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube