తీవ్రమవుతున్న పోటీ, చైనాను ఢీకొట్టాల్సిందే: కీలక బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం

శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించి సూపర్ పవర్‌గా ఎదుగుతున్న చైనా పెద్దన్న కుర్చీపై కూర్చొవాలని తహతహలాడుతోంది.ఇందుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

 Us Senate Approves Bipartisan Legislation Against Chinas Rising Economic Influence-TeluguStop.com

ముఖ్యంగా తయారీ రంగం చైనా బలం.కోవిడ్‌తో అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కకావికలమైనా డ్రాగన్ మాత్రం భారీ వృద్ధిని నమోదు చేసింది.కరోనా వైరస్‌ను ధీటుగా ఎదుర్కొంటూనే.ఆర్ధిక వ్యవస్థను సైతం వేగంగా చక్కదిద్దింది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవడంతో చైనా దీనిని క్యాష్ చేసుకుని మెల్లగా తన లక్ష్యంవైపు అడుగులు వేస్తోంది.అనేక దేశాలకు టీకాను ఉచితంగా ఇవ్వడంతో పాటు ఆర్ధిక సాయం కూడా చేస్తూ తన గుప్పెట్లోకి తెచ్చుకుంటోంది.

మరోవైపు అగ్రరాజ్యాలకు ధీటుగా సరికొత్త ఆవిష్కరణలకు తెరదీసింది.ఈ నేపథ్యంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.

 Us Senate Approves Bipartisan Legislation Against Chinas Rising Economic Influence-తీవ్రమవుతున్న పోటీ, చైనాను ఢీకొట్టాల్సిందే: కీలక బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు అమెరికా సేనేట్ బుధవారం ‘‘ ద ఇన్నోవేష‌న్ అండ్ కాంపిటీష‌న్ యాక్ట్ బిల్లు’ను ఆమోదించింది.దాదాపు 250 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఈ బిల్లు ద్వారా సాంకేతిక రంగంలో ప‌రిశోధ‌న‌లు, ఉత్ప‌త్తిని పెంచేందుకు వీలు కలుగుతుంది.

పరస్పర విరుద్ధ భావాలు కలిగిన రిప‌బ్లిక‌న్లు, డెమోక్రాట్లు సైతం ఆ బిల్లుకు అనుకూలంగా ఓటేయడం విశేషం.వారి మ‌ధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా.ప్రస్తుత పరిస్ధితుల్లో చైనాను ఢీకొట్టాలంటే శాస్త్ర‌, సాంకేతిక రంగాల‌ను బ‌లోపేతం చేయాల్సిందేనని చర్చ సందర్భంగా తెలిపారు.సెనేట్‌లో ఆమోదం పొందిన ఆ బిల్లు ప్రతినిధుల స‌భ‌లో ఆమోదం పొందాల్సి ఉంటుంది.

అనంతరం అధ్యక్షుడు బైడెన్ సంతకంతో బిల్లు చట్టంగా మారనుంది.

Telugu Chip Making, Manufacturing, President Biden, Robot Making, Semiconductor Development, Technology Research-Telugu NRI

ఈ నిధులను టెక్నాల‌జీ రీసెర్చ్‌, సెమీకండ‌క్ట‌ర్ డెవ‌ల‌ప్మెంట్‌, మాన్యూఫ్యాక్చ‌రింగ్‌, రోబో మేకింగ్‌, చిప్ మేకింగ్‌లో ఖ‌ర్చు చేయ‌నున్నారు.కొత్త చ‌ట్టం ప్రకారం.చైనాలో త‌యారైన డ్రోన్ల‌ను కొనుగోలు చేయ‌రాదు.

అలాగే తరచుగా అమెరికన్ సంస్దలపై సైబ‌ర్ దాడుల‌కు పాల్ప‌డుతున్న చైనా సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోనేందుకు వీలు కలుగుతుంది.

.

#Robot Making #Manufacturing #President Biden #Chip Making

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు