వైరల్: సౌత్ ఇండియన్ టిఫిన్స్ కు పిచ్చిపేర్లు పెట్టి అమ్ముతున్నారు.. నిప్పులు చెరుగుతున్న ఆంధ్రులు!

ప్రపంచంలో ఎన్ని రకరకాల వంటలున్నా మన సౌత్ ఇండియన్ వంటకాలే వేరు.ఇక్కడి సాంప్రదయాలు, ఆచారాలు, ఆహారపు అలవాట్లను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది.

 Us Restaurant Indian Crepe Co Named South Indian Breakfasts Viral On Social Medi-TeluguStop.com

ఇక్కడ లభిస్తోన్న ఆహారానికి పెట్టిన పేర్లు చాలా సంప్రదాయంగా ఉంటాయి.వివిధ ప్రాంతాలవారు మన ఉత్తర భారతీయుల వంటలను అమితంగా ఇష్టపడుతున్నారు.

ఎందుకంటే రుచికి రుచి.ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి మన టిఫిన్స్.

అయితే ఎక్కడైనా ఈ ఆహారపదార్ధాలను ఇడ్లి, దోశ, మసాలా దోశ వంటి పేర్లతోనే పిలుస్తారు.ఈపేరు ఎవరన్నా మార్చి అదే ఆహారాన్ని ఇస్తున్నట్లైతే మన మనసు నొచ్చుకుంటుంది.

తాజాగా అదే జరిగింది.

ప్రస్తుతం ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, ఇందులో సౌత్ ఇండియా చెందిన ఆహారపదార్ధాలైన ఇడ్లి, దోస, వంటి వాటికి సరికొత్త పేర్లు ఉండడంతో అందరినీ ఒకింత అసహనానికి గురయ్యేలా చేస్తోంది.

ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.అమెరికాలోని ఇండియన్ క్రీప్ కో.అనే భారతీయ రెస్టారెంట్ ఇక్కడి వంటకాలకు చాలా విచిత్రమైన పేర్లను పెట్టి, ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.ఈ రెస్టారెంట్ మెనూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.

ప్రజలు రెస్టారెంట్‌ను తీవ్రంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు.

ఈ రెస్టారెంట్‌లో సౌత్ ఇండియన్ వంటకాలు అందుబాటులో ఉంటాయి.ఇడ్లీ , దోస, గారెలు ఇలాంటి ఆహారపదార్ధాలు ఈ రెస్టారెంట్‌ సరికొత్త పేర్లతో కస్టమర్స్ కు అందిస్తోంది.వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో.ఈ రెస్టారెంట్‌లోని సాదా దోసకు ‘నేకెడ్ క్రేప్’ అని, మసాలా దోసకి ‘స్మాష్డ్ పొటాటో క్రేప్’ అని, ఇడ్లీ- సాంబార్‌కు ఇక్కడ ‘డంక్డ్ రైస్ కేక్ డిలైట్’ అని, సాంబార్ వడకి ‘డంకెడ్ డోనట్ డిలైట్’ అంటూ సరికొత్త పేర్లని నామకరణం చేశారు.ఈ వింత పేర్లను తెలుసుకున్న స్తానిక ప్రవాసాంధ్రులతో పాటు.

ఆ టిఫిన్స్ ను ఇష్టంగా తినే భారతీయులు కాస్త ఇబ్బందికి లోనవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube