భారత్ కు వ్యతిరేకంగా అమెరికాలో తీర్మానం...బిడెన్ ఆట మొదలు పెట్టాడా..??

భారత్ –పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య ఏళ్ళ తరబడి నలుగుతున్న ఏకైక అంశం కాశ్మీర్ భూభాగం.పాకిస్థాన్ భారత్ లో ఉన్న ఈ భూభాగాన్ని అక్రమించుకోవాలని ఎప్పటికప్పుడు యుక్తులు పన్నుతూనే ఉంది.

 Us Resolution Against India Did Biden Start The Game, India, Pakistan, Biden, Am-TeluguStop.com

ఈ విషయంలో పరాయి దేశం తల దూర్చిన భారత్ అస్సలు సహించదు కూడా గతంలో ట్రంప్ ఈ విషయంలో నేను సంధి చేస్తానని ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే ట్రంప్ వ్యాఖ్యలని ఖండించింది భారత ప్రభుత్వం.ఎవరూ ఈ విషయంలో కల్పించుకోవద్దని గట్టిగానే ప్రకటన చేసింది.

అయితే ఇప్పుడు ఈ విషయంలో మరో సారి అమెరికా జోక్యం చేసుకుంది.

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ కాశ్మీర్ అంశంపై తీర్మానమే చేసేసింది.

ఫిబ్రవరి 5 వ తేదీను కాశ్మీర్ అమెరికన్ డే గా పిలువాలని తీర్మానం చేసింది.న్యూయార్క్ లోని అసెంబ్లీ సభ్యుడు నాదర్ సయోగ్ తో సహా మరో 12 మంది సభ్యులు కలిసి ఈ వివాదాస్పద తీర్మాన్ని ప్రవేశపెట్టారు.

కాశ్మీర్ ప్రజల యొక్క భావ వ్యక్తీకరణ, వారి మనోభావాలను, మత స్వేచ్ఛను కలిగించడానికి న్యూయార్క్ ప్రయత్నం చేస్తుందని ప్రకటించింది.ఈ విషయంపై స్పందించిన భారత ప్రభుత్వం ఘాటుగానే బదులిచ్చింది.

భారత్ అనేది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఈ దేశంలో కాశ్మీర్ అంతర్భాగం అనేది అందరికి తెలుసు, ఇలాంటి సున్నితమైన విషయాలలో జోక్యం చేసుకోవడం సరైన పద్దతి కాదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య ఘర్షణలు పెట్టడం సరికాదని హితవుపలికింది.

అయితే బిడెన్ అధ్యక్ష అభ్యర్ధిగా ఎన్నికైన సమయం మొదలు కాశ్మీర్ అంశంపై భవిష్యత్తులో కల్పించుకుంటాడు అనే సందేహాలను నిపుణులు వ్యక్త పరిచారు.బిడెన్ పాక్ కు మద్దతుదారుడని, ట్రంప్ హయాంలో బిడెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాశ్మీర్ విషయంలో బిడెన్ పాక్ కు సానుకూల ప్రకటన చేశాడని ఒక వేళ అధ్యక్షుడు అయితే భవిష్యత్తులో కాశ్మీర్ విషయంలో కల్పించుకుంటాడు అనే సందేహాలను వ్యక్తం చేశారు.

అనుకున్నట్టుగానే న్యూయార్క్ అసెంబ్లీ ఈ విషయంలో ఏకంగా తీర్మానమే చేసుకుంది.అయితే ఈ పరిణామాలు బిడెన్ కు తెలిసి జరిగాయా, లేదంటే బిడెన్ వ్యూహంలో భాగమేనా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube