పగోడికి బ్యాక్ డోర్ ఓపెన్.. మనోడికి ఫ్రంట్ డోర్ క్లోజ్, భారత్‌పై ఆంక్షలా: బైడెన్‌పై రిపబ్లికన్ల ఆగ్రహం

భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ కకావికలం చేస్తోంది.మనదేశంలోకి వైరస్ ప్రవేశించిన తర్వాత ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4 లక్షలు దాటాయి.

 Us Republican Lawmakers Criticise Biden For Curbs On Travel From India, Corona S-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో ఇంత అత్యధిక కేసులు నమోదవ్వడం నిపుణులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.అదే సమయంలో వరుసగా నాలుగో రోజు 3 వేల మందికి పైనే కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

భారత్‌లో పరిస్ధితుల నేపథ్యంలో అన్ని దేశాలు మనదేశం నుంచి విమాన సర్వీసులపై నిషేధం విధించాయి.అమెరికా, కెనడా, సింగపూర్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, యూఏఈ పరిమితులు విధించిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.భారత్‌లో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలోకి అడుగు పెడితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.49 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.అటు అగ్రరాజ్యం విధించిన ఆంక్షలు మే 4 నుంచి అమలులోకి రానున్నాయి.

గడిచిన 14 రోజులుగా ఇండియాలో ఉంటున్న అమెరికా పౌరులు కాకుండా ఇతరులు తమ దేశంలోకి ప్రవేశించడానికి వీల్లేదని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

అయితే భారత్‌ పట్ల జో బైడెన్ వైఖరిని తప్పుబట్టారు ప్రతిపక్ష రిపబ్లికన్లు.

మన సరిహద్దును మెక్సికో కోసం తెరిచి ఉంచినప్పుడు లేనిది.మన మిత్రదేశమైన భారత్‌పై ఆంక్షలు సమంజసం కాదని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు టిమ్ బుర్చెట్ అన్నారు.

అలాగే మరో రిపబ్లికన్ నేత జాడీ అరింగ్టన్ కూడా బైడెన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.మన శత్రువులకు బ్యాక్ డోర్ ఓపెన్ చేసి.

మిత్రులకు బైడెన్ ఫ్రంట్ డోర్ క్లోజ్ చేయడమేంటంటూ సెటైర్లు వేశారు.అటు కాంగ్రెస్ సభ్యురాలు లారెన్ బోబర్ట్ ఈ విధానాన్ని ‘జెనోఫోబిక్’గా అభివర్ణించారు.

ఇదే సమయంలో ఈ నిషేధం నుంచి అమెరికా పౌరులతో పాటు గ్రీన్‌ కార్డు హోల్డర్లు, వారి భార్యలు, 21 ఏళ్ల లోపు పిల్లలకు మినహాయింపు ఇచ్చింది.అలాగే విద్యార్ధులు, విద్యావేత్తలు, పాత్రికేయులు, వివిధ దేశాల్లో కరోనా నిర్మూలన కోసం కృషి చేస్తున్న వారికి ఎలాంటి ఆటంకాలు వుండవని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

ఈ మేరకు ఆయా దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు పరిమిత సంఖ్యలో వీసాలు జారీ చేస్తాయని ఆ ప్రకటనలో వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube