హెచ్ 1 బీ వీసా: ఉన్న ఆంక్షలు చాలవన్నట్లు మరో కొత్త ప్రతిపాదన  

US Proposal On H-1B For Speciality Jobs May Affect Hundreds Of Indians, H-1B, Indians, US Proposal On H-1B, B1 Visa, Donald Trump, America State Deportment, America Visa Process, Architecture - Telugu America State Deportment, America Visa Process, Architecture, B1 Visa, Donald Trump, Foriegn Architecture, H-1b, Indians, Us Proposal On H-1b

విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో ఉద్యోగం చేయడానికి వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తొలి నుంచి కఠినంగానే వ్యవహరిస్తూ వస్తోంది.ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దీనిపై లెక్కలేనన్ని ఆంక్షలు విధిస్తూ వచ్చారు.

TeluguStop.com - Us Proposal On H 1b For Speciality Jobs May Affect Hundreds Of Indians 1

మధ్యలో కోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ అధ్యక్షుడు ఎక్కడా వెనక్కి తగ్గలేదు.దీనికి తోడు కరోనా వైరస్, అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మరోసారి ట్రంప్ హెచ్ 1 బీ వీసా నిబంధనలు కఠినతరం చేశారు.

కొద్దిరోజుల క్రితం ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ వీసాల జారీ కార్యక్రమాన్ని మరింత కఠినతరం చేసే విధంగా ట్రంప్ యంత్రాంగం కొత్త నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఈ నిర్ణయం విదేశీయుల పాలిట గొడ్డలి పెట్టు లాంటిది.

TeluguStop.com - హెచ్ 1 బీ వీసా: ఉన్న ఆంక్షలు చాలవన్నట్లు మరో కొత్త ప్రతిపాదన-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇదే సమయంలో ఈ కొత్త విధానం అమెరికా ఆర్ధిక వ్యవస్థకి మేలు చేయకపోగా.కీడు చేస్తుందని అక్కడి సంస్థలు పెదవి విరుస్తున్నాయి.

అక్కడితో ఆగకుండా ట్రంప్ నిర్ణయంపై కోర్టును సైతం ఆశ్రయించాయి.ఆయా సంస్థలు కోర్టులో పిటిషన్ వేసిన కొద్దిగంటల్లోనే హెచ్1 బీ వీసాలకు సంబంధించి మరో కీలక ప్రతిపాదన చేసింది అమెరికా ప్రభుత్వం.

హెచ్‌-1బి పరిధిలోకి వచ్చే విదేశీ నిపుణులకు అమెరికా సంస్థల వాణిజ్య అవసరాల కోసం తాత్కాలిక వీసాలు జారీ చేయటాన్ని నిలిపివేయాలంటూ అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతిపాదించింది.విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించేందుకు హెచ్‌ పాలసీకి బదులుగా బి 1 విధానాన్ని ప్రత్యామ్నాయ మార్గంగా మారకుండా అడ్డుకట్ట వేయాలని అమెరికా యోచిస్తోంది.

ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన తాజా ప్రతిపాదనలతో అమెరికా వీసా విధానం మరింత పారదర్శకంగా మారుతుందని.ఇక్కడి ఉద్యోగాల కోసం విదేశీయులు, స్థానికులతో పోటీ పడటం కూడా తగ్గుతుందని అధికారులు అంటున్నారు.

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ ఆలోచన చేయడానికి కారణాలు లేకపోలేదు.ఉదాహరణకు కొద్దిరోజుల క్రితం అమెరికాకు చెందిన ఓ ఆర్కిటెక్చర్‌ సంస్థ పెరుగుతున్న ఖర్చులను తగ్గించేందుకు స్థానిక ఆర్కిటెక్ట్‌లను విధుల నుంచి తొలగించి .ఆ స్థానాల్లో విదేశీ సంస్థ సేవలను వినియోగించుకొనేందుకు అనుమతి కోరింది.ఈ నేపథ్యంలో హెచ్‌ 1బి వీసాల ద్వారా ఆర్కిటెక్ట్‌లను రప్పించుకుంటే.

వారికి ప్రభుత్వ నియమాల ప్రకారం స్థానిక అమెరికన్లతో సమానంగా జీతాలను చెల్లించాల్సి ఉంటుంది.దీంతో తాత్కాలిక అవసరాల కోసం బి1 వీసాలపై విదేశీ ఆర్కిటెక్ట్‌లను రప్పించుకుంటే.

తక్కువ ఖర్చుతోనే తమ పని పూర్తవుతుందని ఈ సంస్థ భావించింది.అంతేకాకుండా హెచ్ 1బి వీసాలతో పోలిస్తే.బి1 వీసాల ఫీజు తక్కువ.

ఈ నూతన నిర్ణయం అమలులోకి వస్తే ఆ ప్రభావం సంవత్సరానికి ఆరు నుంచి ఎనిమిది వేల విదేశీ ఉద్యోగులపై పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రధానంగా ఆన్‌సైట్‌ విధులకుగాను తమ సాంకేతిక సిబ్బందిని బి 1 వీసాలపై పంపే పలు భారతీయ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపనుందని పరిశీలకులు భావిస్తున్నారు.

#H-1B #B1 Visa #Donald Trump #Architecture #USProposal

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Us Proposal On H 1b For Speciality Jobs May Affect Hundreds Of Indians 1 Related Telugu News,Photos/Pics,Images..