అమెరికా అధ్యక్ష ఎన్నికలు: భారతీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం ఎంత...?

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలంటేనే ప్రపంచం మొత్తానికి ఆసక్తి.ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది.

 How Will The 2020 Us Presidential Election Affect On Indian Stock  Markets?, Us-TeluguStop.com

రిపబ్లికన్ నేత, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికార పీఠం అధిష్టించాలని ప్రయత్నిస్తుండగా డెమొక్రాటిక్ నేత జో బిడెన్ సైతం ఏమాత్రం తగ్గడం లేదు.అమెరికాలో చోటు చేసుకునే ఎలాంటి పరిణామాలైనా ప్రపంచంపై పెను ప్రభావాన్ని చూపుతాయి.

ముఖ్యంగా గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి.

సాధారణంగా అమెరికా ఫారిన్ ట్రేడ్ పాలసీ, మానిటరీ పాలసీ, కేపిటల్ ఫ్లోస్ అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపిస్తుంటాయి.

అక్కడ తీసుకునే నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్ల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి.ఏమైనా ఈసారి ఎన్నికలు భారతీయ మార్కెట్లకు పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నాయని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.భారత్ సహా ఏషియా ఫసిఫిక్ ప్రాంతంలోని ఈక్విటీ మార్కెట్లు ఎన్నికల తర్వాత కూడా సానుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.ఇన్వెస్టర్లు ఫండమెంటల్స్ పై రీఫోకస్ చేయాలంటున్నారు.2021లో కరోనాకి వ్యాక్సిన్ రావడంతో పాటు.అమెరికాలో ఎవరు గెలిచినా.

భారత అనుకూల నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.అందువల్ల మనకు పెద్దగా ప్రభావం ఉండదని అంటున్నారు.

పైగా అమెరికా డాలర్ పడిపోతుండటంతో ఫెడరల్ కీలక నిర్ణయాలు తీసుకుంది.వడ్డీరేట్లు 0 కంటే తక్కువ ఉన్నాయి.ఇక మార్కెట్లో లిక్విడిటీ పెంచుతున్నాయి.దీంతో సహజంగానే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

యూరోప్‌లో బ్రెగ్జిట్ సహా సమస్యల కారణంగా అక్కడి ఇన్వెస్ట్ చేయడానికి పెద్దగా ఆసక్తిచూపడం లేదు మదుపుదారులు.ఇండియా, జపాన్, హాంకాంగ్ మార్కెట్లకు పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశం ఉంది.ఇప్పటికే అమెరికాలో వడ్డీరేట్లు పడిపోవడంతో మే నెల తర్వాత ఇండియా ఈక్విటీ మార్కెట్లోకి 11.22 బిలియన్ డాలర్లు వచ్చాయి.ఇక ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు.

పైగా భారతీయ స్టాక్ మార్కెట్‌లు మెరుగ్గా రాణిస్తున్నాయి.

మార్చి తర్వాత దాదాపు 50శాతం రికవరీ అయింది.వరుస లాభాలతో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.

కాబట్టి రానున్న రెండు, మూడు నెలలు ఖచ్చితంగా మార్కెట్‌లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది.అమెరికా అధ్యక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా భారతీయ మార్కెట్లు లాభపడతాయని అంచనా వేస్తున్నారు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube