అన్నంత పనిచేసిన ట్రంప్: సోషల్ మీడియా దిగ్గజాలపై ఉక్కుపాదం.. ఏజెన్సీలకు ‘‘ పవర్ ’’

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్– సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మధ్య రాజుకున్న వివాదం పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టులపై ట్విట్టర్ ఫ్యాక్ట్ చెక్ లేబుల్ వేయడం అగ్రరాజ్యాధినేతకు ఆగ్రహం తెప్పించింది.

 Us President Donald Trump ,social Media Firms For Policing Content, Trump, Twitt-TeluguStop.com

ఇది తన భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కలిగించే విషయమని.సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఆ మాట చెప్పిన కొన్ని గంటలకు ట్రంప్ అన్నంత పనిచేశారు.

గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ సహా సోషల్ మీడియా దిగ్గజాలు ఆన్‌లైన్ కంటెంట్‌ను తనిఖీ చేయడంపై చర్యలు తీసుకునే విధంగా అమెరికన్ ఏజెన్సీలకు అధికారం కల్పించే ఆదేశాలపై శుక్రవారం అధ్యక్షుడు సంతకం చేశారు.

దేశంలోని ప్రముఖ సోషల్ మీడియా కంపెనీలు రాజకీయ వివక్షకు పాల్పడకుండా నిలువరించే ప్రయత్నంలో భాగంగానే ట్రంప్ ప్రభుత్వం ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమల్లోకి తీసుకొచ్చినట్లు అమెరికన్ వార్తాసంస్థ ది వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది.

Telugu Firms, Trump, Ceo, War, Donald Trump-

‘ఓ పెను ప్రమాదం నుంచి భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ఈ ఆదేశాలకు ఆమోదముద్ర వేసేముందు పేర్కొన్నారు.అయితే అధ్యక్షుడు హడావిడిగా జారీ చేసిన ఈ ఉత్తర్వుల చట్టబద్దతపై టెక్ రంగానికి చెందిన న్యాయవాదులు, కాంగ్రెస్‌లోని చట్టసభ సభ్యులు, రాజకీయ నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.కాగా నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్ అవలంభించడం ద్వారా మోసం జరిగే అవకాశం ఉందని ట్రంప్ ట్వీట్ చేశారు.

ఇందుకు సంబంధించి ఆయన చేసిన ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకోవాలంటూ ట్విట్టర్ ట్రంప్ ట్వీట్లకు ఫ్యాక్ట్ చెక్ లేబుల్‌ను ఉంచింది.ఇన్నాళ్లు సాధారణ ఖాతాదారుల విషయంలో పాటించే నిబంధనల్ని అధ్యక్షుడు ట్రంప్‌నకు వర్తింపజేసేందుకు ట్విట్టర్ నిరాకరించింది.

ప్రస్తుతం అందుకు భిన్నంగా వ్యవహరించడం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ వివాదంలోకి తమ ఉద్యోగులను లాగవద్దని, ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధమని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే అన్నారు.

పారదర్శకమైన సేవలు అందించడం తమ ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube