తెలుగు అమ్మాయిని వరించిన యూఎస్ ప్రెసిడెంట్ స్కాలర్

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కాలర్ షిప్ ఏదైనా ఉందంటే అది అమెరికా ప్రెసిడెన్షియల్ అనే చెప్పాలి.ఎంతో మంది ఈ స్కాలర్ పొందాలని కలలు గంటూ ఉంటారు.

 Us President Scholar, Indian Girl, Ap Student, America-TeluguStop.com

అందుకు ఎంతో కష్టపడుతారు కూడా.ముఖ్యంగా భారతీయులు ఎంతో మంది అమెరికా అందించే స్కాలర్ షిప్ లకి పోటీ పడుతూ ఉంటారు విజయం సాధిస్తూ ఉంటారు.

అయితే అమెరికా ప్రెసిడెన్షియల్ స్కాలర్ పొందటం మాత్రం అత్యంత కష్టతరమైన విషయమనే చెప్పాలి.కానీ భారతీయురాలు.

తెలుగు అమ్మాయి ఈ స్కాలర్ షిప్ ని సాధించి రికార్డులకి ఎక్కింది.వివరాలలోకి వెళ్తే.


ఏపీలోని అనంతపురం జిల్లాకి చెందిన సంజన రెడ్డి అనే అమ్మాయి తల్లి తండ్రులు ఎన్నో ఏళ్ళ క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు.చదువుల్లో చిన్నతనం నుంచీ చక్కని ప్రతిభ చూపించే సంజన ప్రెసిడెంట్ స్కాలర్ పై దృష్టి పెట్టింది.

అమెరికాలోని విప్ కాన్సిస్ రాష్ట్రం నుంచీ అమ్మాయిల కోటాలో ఆమె ఈ స్కాలర్ కోసం పోటీ పడింది.ఆమె చక్కని ప్రతిభతో ఎట్టకేలకి విజయం దక్కించుకుంది.

విద్య ఆర్టస్ , టెక్నాలజీ లలో విశేష ప్రతిభ కనబరించిన విద్యార్ధులకి ఈ స్కాలర్ ని అందిస్తారు.

సంజన ఈ మూడు విభాగాలలో తనదైన ప్రతిభ కనబరచడంతో ఈ స్కాలర్ ఆమెని వరించింది.

ఇదిలాఉంటే.ఈ స్కాలర్ పొందిన సంజనను ప్రత్యేకమైన విమానంలో వైట్ హౌస్ కి తీసుకువెళ్ళి అధ్యక్షుడు ట్రంప్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందిస్తారు.

అంతేకాదు ఈ క్రమంలో ఆమె విద్యా సంభందిత అంశాలపై అధ్యక్షుడితో మాట్లాడే అవకాశాన్ని కూడా ఇస్తారు.ఓ తెలుగు అమ్మాయి కావడంతో స్థానికంగా ఉన్న తెలుగు ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube