యూఎస్ : క్యాపిటల్ హిల్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు.. సందేశం పంపిన బైడెన్

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో గతేడాది నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

 Us President Joe Biden's Letter To India's Azadi Ka Amrit Mahotsav Event At Capi-TeluguStop.com

గడిచిన 75 ఏళ్ల కాలంలో భారతదేశం సాధించిన రాజకీయ, సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక పురోగతిని ఓ ఉత్సవంలా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.దీనిలో భాగంగా 12 మార్చి 2021 నుంచి 2022 ఆగస్టు 15 వరకు మొత్తం 75 వారాల పాటు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

భారత్‌లోని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలతో పాటు వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలోనూ ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గత వారం అమెరికాలోని క్యాపిటల్ హిల్‌లో ఆసియా అమెరికన్ పసిఫిక్ ఐలాండర్ మాస వేడుకలతో పాటు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ న్యూయార్క్- న్యూజెర్సీ అండ్ న్యూ ఇంగ్లాండ్ నిర్వహించిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.

న్యూ ఇంగ్లాండ్ ఎఫ్ఐఏ ప్రెసిడెంట్‌ అభిషేక్ ఎస్ సింగ్‌కి సందేశం పంపారు.ప్రస్తుతం అమెరికా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని.మనం కలిసి ప్రయాణించే రహదారి మన చరిత్రలోనే అత్యంత క్లిష్టంగా వుంటుందని ఆ లేఖలో బైడెన్ వ్యాఖ్యానించారు.అమెరికాను సంపన్నమైన, సురక్షితమైన దేశంగా మార్చడానికి కలిసి పనిచేయగలమనే నమ్మకం తనకు వుందని లేఖలో ఆయన ఆకాంక్షించారు.

Telugu America, Azadika, Capitol Hill, India, Indoamerican, Joe Biden, Narendra

ఇకపోతే.సెనేటర్ కోరి బుకర్‌తో సహా దాదాపు 21 మంది చట్టసభ సభ్యులు రాజా కృష్ణమూర్తి, మిజీ షెర్రిల్, షీలా జాక్సన్, ఫ్రాంక్ పల్లోన్, డేవిడ్ సిసిలిన్, టామ్ మాలినోవ్స్కీ, అబిగైల్ స్పాన్‌బెర్గర్, విన్సెంట్ గొంజాలెజ్, సూసీ లీ, హకీమ్ సెకౌ ఎం జెఫ్ తదితర కాంగ్రెస్ సభ్యులు . రాస్, అడ్రియానో ఎస్పాయిల్, జిమ్ మెక్‌గవర్న్, మాట్ కార్ట్‌రైట్, జిమ్ లాంగెవిన్ తదితర కాంగ్రెస్ మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అలాగే సెనేటర్ జాక్ రీడ్, జీన్ షాహీన్‌లు కూడా అమెరికాకు ఇండో అమెరికన్ కమ్యూనిటీ చేసిన సేవలను పశంసిస్తూ తమ సందేశాలను పంపారు.

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ఆగస్ట్ 15న న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం వంటి చారిత్రాత్మక ఘటనలు భారత్- అమెరికా మధ్య సంబంధాలను బలపరచడంలో కీలకపాత్ర పోషించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube