భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి.. మరోసారి నామినేట్ చేసిన బైడెన్, ఈసారైనా సెనేట్ ఆమోదిస్తుందా..?

భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్, డెమొక్రాటిక్ పార్టీ నేత ఎరిక్ గార్సెట్టిని మళ్లీ నామినేట్ చేశారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. ఈ సారి ఆయన నామినేషన్‌కు సెనేట్ ఆమోదం లభిస్తుందని వైట్‌హౌస్ విశ్వాసం వ్యక్తం చేసింది.2021లోనే భారత్‌లో అమెరికా రాయబారిగా గార్సెట్టిని నామినేట్ చేశారు బైడెన్.అయితే తన సిబ్బందిలో ఒకరి పట్ల ఎరిక్ అనుచితంగా ప్రవర్తించాడంటూ రిపబ్లికన్ సెనేటర్ చంక్ గ్రాస్లీ అభ్యంతరం తెలిపారు.

 Us President Joe Biden Renominates Eric Garcetti As Envoy To India Details, Us P-TeluguStop.com

దీంతో గార్సెట్టి నామినేషన్ నిలిచిపోయింది.

ఎరిక్ గార్సెట్టికి డెమొక్రాట్లలో సమర్థుడైన నేతగా పేరుంది.

మూడు దశాబ్ధాల తర్వాత వేసవి ఒలింపిక్స్‌ను అమెరికా గడ్డపైన తిరిగి నిర్వహించేందుకు ఆయన చేసిన ప్రయత్నం విజయవంతమైంది.దేశంలో అత్యంత రద్దీగా వుండే రెండో ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ అయిన లాస్ ఏంజిల్స్ మెట్రోకు గార్సెట్టి అధ్యక్షత వహిస్తున్నారు.

దీనిలో కొత్తగా 15 లైన్లను నిర్మిస్తున్నారు.అంతేకాకుండా పారిస్ వాతావరణ ఒప్పందాన్ని అమెరికాలోని 400 మంది మేయర్లు పాటించే విధంగా ఏర్పాటు చేసిన ‘‘ క్లైమేట్ మేయర్‌’’కు కో ఫౌండర్‌గా ఎరిక్ వ్యవహరిస్తున్నారు.

Telugu America, Envoy India, Eric Garcetti, Ericgarcetti, India, Indiausa, India

యూఎస్ నేవీ రిజర్వ్ కాంపోనెంట్‌లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా 12 ఏళ్లపాటు పనిచేసిన గార్సెట్టి.2017లో లెఫ్టినెంట్‌గా రిటైర్ అయ్యారు.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు.యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు.ఎరిక్‌.2013 నుంచి లాస్ ఏంజెల్స్ మేయర్‌గా, 12 ఏండ్లపాటు సిటీ కౌన్సిల్‌ సభ్యులుగా పనిచేశారు.భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా బైడెన్‌ తనకు అత్యంత నమ్మకస్తుడైన ఎరిక్‌ను రాయబారిగా నామినేట్‌ చేశారని శ్వేతసౌథం అప్పట్లో తెలిపింది.

Telugu America, Envoy India, Eric Garcetti, Ericgarcetti, India, Indiausa, India

అమెరికా అధ్యక్షుడికి కుడిభుజంగా అభివర్ణించే ఎరిక్‌ను భారత్‌కు పంపడం వెనుక పెద్ద వ్యూహమే వుందంటున్నారు విశ్లేషకులు.భారత్‌తో దౌత్యపరంగా అత్యంత సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఎరిక్ నామినేషన్‌ వ్యవహారం అమెరికాలో ప్రాధాన్యత సంతరించుకుంది.ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేయాలని అగ్ర రాజ్యాధినేత జో బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అయితే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్.ఇటీవల రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచుతున్నట్లు చెప్పింది.భారత సైనిక దిగుమతుల్లో ఎక్కువ భాగం రష్యా నుంచి వస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube