ఆదివారం సాయంత్రం గుజరాత్ లో మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో 140 మంది మరణించడం తెలిసిందే.ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై దాదాపు 500 మంది ఉన్నారని అంచనా.
దీంతో నదిలో ఎంతమంది మునిగిపోయారు అనేది ఇంకా లెక్క తేలడం లేదు.మరోపక్క సహాయక చర్యలు ఇంకా చేపడుతున్నారు.
టికెట్లు కొన్న వారి బట్టి చూస్తే ఇంకా 100 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.ఇదిలా ఉంటే ఈ దుర్ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందించారు.
ఈ దుర్ఘటనలో మరణించిన వారికి ఇద్దరు సంతాపం వ్యక్తం చేశారు.
ఇటువంటి కష్ట సమయంలో భారతీయ ప్రజలకు అండగా ఉంటామని మద్దతిస్తామని తెలిపారు.
ఈ దుర్ఘటనలో స్నేహితులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు బై భార్య జిల్ తానా ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.ఇటువంటి కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉంటామని బైడెన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
ఇదే సమయంలో కమలా హారిస్.గుజరాత్ కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో బాధితులకు అండగా భారత్ కి మద్దతుగా ఉంటామని తెలిపారు.
ఈ ప్రమాదంలో సన్నిహితులను కోల్పోయి బాధలో ఉన్న వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడం జరిగింది.