తన అడ్మినిస్ట్రేషన్‌లో ఆరుగురు ఇండో అమెరికన్లకు రెన్యూవల్... బైడెన్ ఆదేశాలు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు కట్టబెడుతూ వస్తున్నారు జో బైడెన్. అలా ఇప్పటి వరకు 130 మందికి పైగా ఇండో అమెరికన్లు కీలక స్థానాల్లో నియమించబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.యునైటెడ్ స్టేట్స్‌ జనాభాలో ఒక శాతంగా వున్న భారతీయులకు దేశ పాలనలో ఈ స్థాయిలో అవకాశాలు దక్కడం నిజంగా మనం గర్వించాల్సిన విషయమే.ఇదిలావుండగా… మంగళవారం కనీసం అర డజను మంది భారతీయ అమెరికన్‌లను కీలక పరిపాలనా స్థానాలకు బైడెన్ తిరిగి నామినేట్ చేశారు.అయితే వీటికి సెనేట్ ఆమోదం లభించాల్సి వుంది.118వ కాంగ్రెస్ నిన్న కొత్త సెనేటర్లు, ప్రతినిధుల సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియతో ప్రారంభమైంది.

 Us President Joe Biden Re-nominates Half A Dozen Indian-americans To Key Adminis-TeluguStop.com

ఇక బైడెన్ తిరిగి నామినేట్ చేసిన వారిలో రిచర్డ్ వర్మ (డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్), డాక్టర్ వివేక్ హల్లెగెరె మూర్తి (ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో అమెరికా ప్రతినిధి), అంజలి చతుర్వేది (జనరల్ కౌన్సెల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్న్ అఫైర్స్), రవి చౌదరి (ఎయిర్‌ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీ), గీతా రావు గుప్తా ( గ్లోబల్ ఉమెన్స్ ఇష్యూ రాయబారి), రాధా అయ్యంగార్ ప్లంబ్ (డిఫెన్స్ అండర్ సెక్రటరీ)వున్నారు.వీరందరిని గత కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా బైడెన్ నామినేట్ చేశారు.

కానీ వీరి నియామకానికి సెనేట్ ఆమోదం లభించలేదు.

Telugu Geeta Rao Gupta, Radhaiyengar, Ravi Choudary, Richard Varma, Joe Biden, V

52 ఏళ్ల వర్మ ప్రస్తుతం మాస్టర్ కార్డ్ గ్లోబల్ పబ్లిక్ పాలసీకి జనరల్ కౌన్సెల్, హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఈ హోదాలో ఆయన అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వున్న కంపెనీ చట్టం, విధాన పరమైన విధులను పర్యవేక్షిస్తారు.డెమొక్రాటిక్ పార్టీకి చెందిన రిచర్డ్ వర్మ 2014 నుంచి 2016 వరకు భారత్‌లో అమెరికా రాయబారిగా వ్యవహరించారు.

ఈ ఏడాది ప్రారంభంలోనూ బైడెన్ తన ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగానూ రిచర్డ్ వర్మను నియమించిన సంగతి తెలిసిందే.ప్రెసిడెంట్స్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డ్ (పీఐఏబీ) అనేది అధ్యక్షుని కార్యనిర్వాహక కార్యాలయంలో స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక ఏజెన్సీ.

Telugu Geeta Rao Gupta, Radhaiyengar, Ravi Choudary, Richard Varma, Joe Biden, V

అటు రాధా అయ్యంగర్ గూగుల్‌లో ట్రస్ట్ అండ్ సేఫ్టీకి రీసెర్చ్ అండ్ ఇన్‌సైట్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.అక్కడ బిజినెస్ అనలిటిక్స్ , డేటా సైన్స్ అండ్ టెక్నికల్ రీసెర్చ్‌లో క్రాస్ ఫంక్షనల్ టీమ్‌లకు నాయకత్వం వహించారు.ఫేస్‌బుక్‌లో పాలసీ అనాలిసిస్ గ్లోబల్ హెడ్‌గానూ పనిచేశారు.ఆర్ఏఎన్‌డీ కార్పోరేషన్‌లోనూ రాధ సీనియర్ ఆర్ధికవేత్తగా వ్యవహరించారు.వీటితో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ వైట్‌హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో సీనియర్ హోదాల్లోనూ పనిచేశారు.కెరీర్ తొలినాళ్లలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, హార్వర్డ్‌లో పోస్ట్‌ డాక్టోరల్ వర్క్ చేశారు.

ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ, ఎంఎస్ పట్టా పొందారు.మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీఎస్ చదివారు.

Telugu Geeta Rao Gupta, Radhaiyengar, Ravi Choudary, Richard Varma, Joe Biden, V

ఇక రవి చౌదరి విషయానికి వస్తే ఈయన గతంలో అమెరికా రవాణా శాఖలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.అంతేకాకుండా ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ)లోని కమర్షియల్ స్పేస్ ఆఫీస్‌లో డైరెక్టర్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ అండ్ ఇన్నోవేషన్‌గానూ విధులు నిర్వర్తించారు.ఈ హోదాలో ఎఫ్ఏఏ కమర్షియల్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ మిషన్‌కు మద్ధతుగా అధునాతన అభివృద్ధి, పరిశోధన కార్యక్రమాల అమలును పర్యవేక్షించారు.రవాణా శాఖలో విధులు నిర్వర్తించే సమయంలో దేశవ్యాప్తంగా వున్న తొమ్మిది ప్రాంతాలలో విమానయాన కార్యకలాపాల ఏకీకరణ కోసం రీజియన్స్ అండ్ సెంటర్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube