బైడెన్ కొలువులోకి మరో భారతీయుడు: ఏకంగా అగ్రరాజ్య రక్షణ బాధ్యతలే..!!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జట్టులో మరో భారతీయుడికి అత్యున్నత పదవి దక్కనుంది.భారత సంతతికి చెందిన దలీప్ సింగ్‌‌ని డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమించాలని అధ్యక్షుడు భావిస్తున్నారు.

 Us President Joe Biden Plans To Name New York Fed Market Chief Daleep Singh As N-TeluguStop.com

దలీప్ సింగ్ ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఫెడరల్ రిజర్వ్‌ బ్యాంక్‌లోని మార్కెట్స్ గ్రూప్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.న్యూయార్క్ ఫెడ్ బ్యాంక్ ఫిబ్రవరి 5న విడుదల చేసిన ప్రకటన ప్రకారం.

బైడెన్ జట్టులో చేరేందుకు దలీప్ సింగ్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టబోతున్నారని తెలిపింది.డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు హోదాలో ఆయన డిప్యూటీ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్‌ (ఎన్ఈసీ) డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తారు.అలాగే జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్, ఎన్ఈసీ డైరెక్టర్ బ్రియాన్ డీస్‌లకు నేరుగా రిపోర్ట్ చేస్తారు.
45 ఏళ్ల దలీప్ సింగ్ 2011 నుంచి 2017 వరకు యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు.బరాక్ ఒబామా అధ్యక్షుడిగా వున్న సమయంలో ఫైనాన్షియల్ మార్కెట్స్ కోసం యాక్టింగ్ అసిస్టెంట్ సెక్రటరీగా, అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు.ట్రెజరీ విభాగంలో వున్నప్పుడు రష్యా, ఉక్రెయిన్, గ్రీస్, ప్యూర్టోరికోలలో తలెత్తిన సంక్షోభాలను ఎదుర్కోవడానికి దలీప్ చక్కని ప్రణాళికను రూపొందించారు.

దలీప్ తన నాయకత్వ లక్షణాలతో న్యూయార్క్ ఫెడ్‌పై ప్రభావాన్ని చూపారని బ్యాంక్ అధ్యక్షుడు, సీఈవో జాన్ సి విలియమ్స్ ప్రశంసించారు.గతేడాది కోవిడ్‌కు ప్రతిస్పందనగా ఫెడ్ ప్రారంభించింన అత్యవసర సౌకర్యాలకు సంబంధించి ఆయన కీలక పాత్ర పోషించారని విలియమ్స్ గుర్తుచేశారు.

ముఖ్యమైన ఆర్ధిక విధానానికి ఆయన అనుభవం, నైపుణ్యం తోడ్పడిందని చెప్పారు.సింగ్ స్థానంలో సెంట్రల్ బ్యాంక్, ఇంటర్నేషనల్ అకౌంట్ సర్వీసెస్ హెడ్ అన్నే బామ్ మార్కెట్ హెడ్స్ తాత్కాతిక చీఫ్‌గా వ్యవహరించనున్నారు.

అయితే దలీప్ సింగ్ వారసుడి కోసం ఫెడ్ త్వరలో తన అన్వేషణ ప్రారంభించనుంది.

Telugu Yorkfed, Joe Biden, Joebiden-Telugu NRI

సింగ్ ఫిబ్రవరి 2020లో న్యూయార్క్ ఫెడ్‌లో చేరడంతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు.మార్కెట్స్ గ్రూప్ హెడ్‌గా విధానం, వ్యూహాం, విశ్లేషణ, కార్యచరణ తదితరాలను ఏకతాటిపైకి తీసుకురావడంపై దృష్టి పెట్టారు.గతంలో దలీప్ సింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అయిన ఎస్‌పీఎక్స్ క్యాపిటల్‌లో సీనియర్ పార్ట్‌నర్‌గా, చీఫ్ యూఎస్ ఎకనమిస్ట్‌గా వ్యవహరించారు.

మేరీల్యాండ్‌లోని ఓల్నీలో పుట్టిన ఆయన డ్యూక్ యూనివర్సిటీలో ఎకనమిక్స్ అండ్ పబ్లిక్ పాలసీలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు.మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బిజినెస్ట్ అడ్మినిస్ట్రేషన్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ ఎకనమిక్స్‌పై మాస్టర్స్ చేశారు.

కాగా, సింగ్ ముత్తాత దలీప్ సింగ్ యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికైన మొదటి ఆసియా అమెరికన్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube