5 ల‌క్ష‌ల కోవిడ్ మృతులు: బాధగా వున్నా నిజాన్ని అంగీకరించక తప్పదు.. బైడెన్ భావోద్వేగం  

US President Biden calls 500,000 death toll a heartbreaking milestone,US President Joe Biden, 5lakh Deaths, Covid,Candle Light Program, Covid vaccine - Telugu 5lakh Deaths, Candle Light Program, Covid, Covid Vaccine, Us President Biden Calls 500000 Death Toll A Heartbreaking Milestone, Us President Joe Biden

కోవిడ్‌ కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు సుమారు 5 లక్షల మంది మరణించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన క్యాండిల్ లైట్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పాల్గొని మృతులకు నివాళులర్పించారు.

TeluguStop.com - Us President Joe Biden 5lakh Covid Deaths

ఈ సందర్భంగా అంతా నిమిషం పాటు మౌనం పాటించారు.అనంతరం బైడెన్ మాట్లాడుతూ.

దేశంలో 5 ల‌క్ష‌ల కోవిడ్ మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం హృద‌య‌విదార‌క‌మైన మైలురాయి అని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు.మొద‌టి ప్ర‌పంచ యుద్ధం, రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం, వియ‌త్నాం యుద్ధాల్లో మరణించిన అమెరికన్ల సంఖ్య కంటే కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని బైడెన్ చెప్పారు.

TeluguStop.com - 5 ల‌క్ష‌ల కోవిడ్ మృతులు: బాధగా వున్నా నిజాన్ని అంగీకరించక తప్పదు.. బైడెన్ భావోద్వేగం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఒక దేశంగా ఈ నిజాన్ని అంగీక‌రించ‌క త‌ప్ప‌దన్న ఆయన, బాధ‌ను జ‌యించ‌డం నేర్చుకోవాల‌ని ప్రజలకు సూచించారు.

జీవితంలో ఏం సాధించాలనేది దు:ఖం ద్వారానే బైడెన్ అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా తన భార్యా, పిల్లలను ఓ రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.అమెరిక‌న్లంద‌రూ కోవిడ్‌పై పోరాటం చేయాల‌ని అధ్యక్షుడు తెలిపారు.మరణించిన వారికి సంతాప సూచికంగా రాబ‌ోయే ఐదు రోజుల పాటు ప్ర‌భుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాల‌ను అవ‌న‌తం చేయాల‌ని బైడెన్ అధికారులను ఆదేశించారు.కరోనాపై పోరాటంలో మరణించిన వారు కొన్ని త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కులు అని ఆయన కొనియాడారు.

వీరిలో అమెరికాలో పుట్టిన‌వారితో పాటు మనదేశానికి వ‌ల‌స‌వ‌చ్చిన వారు కూడా ఉన్నార‌ని జో బైడెన్ ఉద్వేగానికి గురయ్యారు.

కాగా, అమెరికాలో గతేడాది ఫిబ్రవరిలో తొలి కరోనా మరణం సంభవించిన విషయం తెలిసిందే.అప్పడు మొదలైన మరణ తాండవం కేవలం తొలి నాలుగు నెలల్లోనే లక్ష మార్కును దాటింది.ఆ తర్వాత సెప్టెంబర్‌‌లో 2 లక్షలు, డిసెంబర్‌‌లో 3 లక్షల మంది కోవిడ్‌కు బలయ్యారు.

జనవరి 19న అధికార మార్పిడి జరిగే సమయానికి 4 లక్షలకు చేరుకుంది.అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే లక్ష మరణాలు చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది.

వైరస్ దేశంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉదాసీన వైఖరి కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమైంది.మధ్యలో కాస్త ఉపశమనం లభించినట్లుగా కనిపించినా.

చలికాలం ప్రవేశించడం, థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల కారణంగా అమెరికాలో కేసులు విపరీతంగా పెరిగిపోయాయి

.

#COvid #UsPresident #5lakh Deaths #USPresident #CandleLight

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు