అమెరికా అధ్యక్షుడికి చైనాలో బ్యాంక్ అకౌంట్..!

కరోనా కేసులు అమెరికాలో అధికం అవుతున్నప్పటికీ చైనా పై అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఘాటు విమర్శలు చేశాడు.కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాపించడానికి చైనా ప్రభుత్వమే కారణమని కరోనా వైరస్ ను”చైనీస్ వైరస్ “అంటూ పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు.

 Us President, Bank Account, China,elections, Trump Lawyer Garden, Joe Bidden, Re-TeluguStop.com

అంతేకాకుండా అమెరికాలో చైనా ఉత్పత్తులను నిషేధించాలని, చైనా ఉత్పత్తులపై అధికంగా టాక్స్ లను విధించడం, ఏకంగా డ్రాగన్ కంట్రీ పై యుద్ధం ప్రకటించినంత పని చేశారు.చైనాను ఇంత తీవ్రంగా విమర్శించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు చైనాలో బ్యాంక్ అకౌంట్ ఉందని తెలియడంతో రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ప్రస్తుతం అమెరికాలో నవంబర్ 3న జరగబోయే ఎలక్షన్ లలో అక్కడి రాజకీయం వేడెక్కింది.ప్రస్తుతం అధ్యక్షత పదవిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ కు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ లు హోరాహోరీగా తలపడుతున్నారు.

కరోనా సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు జరగబోయే ఎన్నికలలో అతనికి చేదు అనుభవాన్ని మిగిలిస్తాయని, ఇప్పటికే పలు సర్వేలలో తేలింది.జరగబోయే ఎన్నికలలో ట్రంప్ కన్నా బైడెన్ ముందంజలో ఉన్నారని సర్వేలు తేల్చాయి.

ట్రంపు మాత్రం ఇందుకు భిన్నంగా జరగబోయే ఎలక్షన్లలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.కరోనా నుంచి కోలుకున్న తర్వాత ట్రంప్ జోరుగా ప్రచారం నిర్వహించారు తనకు విజయం అందించే ప్రాంతాలలో తన ప్రత్యేక దృష్టి పెట్టాడు.

ప్రస్తుతం ఉన్నా వేడి వాతావరణంలో ట్రంపు చైనాలో బ్యాంక్ అకౌంట్ ఉందన్న విషయం తెలియడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.

కరోనా నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ పై అంతగా విరుచుకు పడ్డ ట్రంప్ కి చైనాలో బ్యాంక్ అకౌంట్ ఉందని తెలియడంతో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డారు.

అయితే అకౌంట్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరిగాయి అన్న విషయం ప్రస్తుతం బయటికి రాలేదు.ట్రంప్ రాజకీయాలలోకి రాకముందు చైనా తో కలిసి వ్యాపారాలు చేసేవారు.ట్రంప్ ఈ అకౌంట్ ద్వారా 1,88,561 డాలర్లను పన్నుగ చైనాకుచెల్లించినట్లు రికార్డులో పేర్కొంది.2015 సంవత్సరం రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఎలాంటి వ్యాపారాలు చేయలేదని, అందువల్లనే ఈ అకౌంట్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగలేదని,ట్రంప్ ఆర్గనైజేషన్ లాయర్ గార్డెన్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube