అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వైదొలగిన తరువాత నూతన అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన బిడెన్ భారత్ తో ఎలాంటి సంభంధాలు నెరుపుతారో అంటూ అందరూ ఆందోళన వ్యక్తం చేశారు.బిడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాకిస్తాన్, చైనాలతో మంచి సంభంధాలు నెరిపారని అధ్యక్షుడు అయిన తరువాత కూడా అదే పరిస్థితి నెలకొంటే భారత్ పరిస్థితి ఏంటి అంటూ అందోళన వ్యక్తం చేశారు కూడా.
అయితే అందరి ఊహాగానాలకు తెరదించుతూ బిడెన్ భారత్ మాకు ఎంతో మిత్ర దేశం అంటూనే పాక్, చైనా ల వైఖరి పట్ల అసంతృప్తి ఎన్నో సందర్భాలలో వ్యక్తం చేశారు.అంతేకాదు తన టీమ్ లో అత్యధికంగా భారతీయులను ఎంపిక చేసుకున్న బిడెన్ మా పూర్వీకులు కూడా భారతీయులే అంటూ చెప్పుకొచ్చారు.
తాజాగా మరో సారి బిడెన్ భారత్, అమెరికా భంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
భారతదేశ ప్రజలకు 75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు అమెరికా అధ్యక్షుడు బిడెన్.
భారత్ లో అలాగే ప్రపంచ వ్యాప్తంగా మీ పండుగను జరుపుకుంటున్న ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు అంటూ అతిపెద్ద ప్రజా స్వామ్య దేశమైన భారత్ ప్రజల కోసం అను నిత్యం ఆలోచిస్తుందని, ప్రజలకు భారత్ మేలు చేసేలా చర్యలు చేపడుతుందని కొనియాడారు.అలాగే భారత్ అమెరికా రెండూ కూడా ప్రజల కోసం పాటుపడే దేశాలని, ఈ రెండు దేశాల మధ్య భందాలు బలంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
అమెరికాలో ఉంటున్న భారతీయ అమెరికన్స్ దాదాపు 4 మిలియన్స్ పైగా ఉన్నారని, వారందరి వలన అమెరికా భారత్ ల మధ్య భంధం మరింతగా బలపడిందని, అందుకు తాము ఎంతో సంతోషంగా ఉన్నామని అన్నారు బిడెన్.అమెరికా అభివృద్ధితో భారతీయ అమెరికన్స్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని వారి సేవలు వెలకట్టలేనివని తెలిపారు.
ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటున్న భారత్ కు అమెరికా ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈ నేపధ్యంలోనే భారత్ తో మరింత బలమైన భంధం ఏర్పడటానికి కారణమవుతోందని, భవిష్యత్తులో భారత్ తో తిరుగులేని మైత్రి కొనసాగుతుందని తెలిపారు బిడెన్.ప్రస్తుతం చైనా, పాక్, కొత్తగా తాలిబన్ ఇరు దేశాలు భారత్ పై కాలు దువ్వుతున్న సమయంలో బిడెన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.