అమెరికా ఈజ్ బ్యాక్: బైడెన్... ఫారిన్ పాలసీ, జాతీయ భద్రతా టీమ్ ఇదే  

US President-elect Joe Biden presents security and foreign policy team, Joe Biden, Kamala Harries, Biden Cabinet, Anthony Blinken‌, Joh, Alejandro Myorcusn Kerry, April Heins, Linda Thomas Greenfield - Telugu Alejandro Myorcusn Kerry, Anthony Blinken‌, April Heins, Biden Cabinet, Joe Biden, Joh, Kamala Harries, Linda Thomas Greenfield

డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా దిగజారిపోయాయంటూ ఎన్నికల ప్రచారంలో తన నినాదంగా చేసుకున్నారు జో బైడెన్.అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు బైడెన్ ప్రణాళికలు రచిస్తున్నారు.

TeluguStop.com - Us President Elect Joe Biden Presents Security And Foreign Policy Team

మరోవైపు కరోనా వైరస్‌ను నివారించడంలో ట్రంప్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన జో బైడెన్‌ కరోనా నివారణకు ఏం చేయబోతున్నారు అనేది వేయి డాలర్ల ప్రశ్నగా ఉన్నది.

ప్రస్తుతం శీతాకాలంలోకి ప్రవేశించడంతో కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

TeluguStop.com - అమెరికా ఈజ్ బ్యాక్: బైడెన్… ఫారిన్ పాలసీ, జాతీయ భద్రతా టీమ్ ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీనిని ఆయన ఎలా ఎదుర్కొంటారనే అంశంతో పాటు ఆర్థిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే కోవిడ్‌కు సంబంధించి టాస్క్‌ఫోర్స్‌ను ప్రకటించిన జో బైడెన్ తాజాగా.

అత్యంత కీలకమైన విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రతకు సంబంధించి తన బృందాన్ని ప్రకటించారు.

బైడెన్ టీమ్ ఇదే:


సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అంటోనీ బ్లింకెన్‌.
ప్రెసిడెన్షియల్‌ ఎన్వాయ్‌ ఫర్‌ క్లైమేట్‌ జాన్‌ కెర్రీ.
సెక్రటరీ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ అలెజాండ్రో మయోర్కస్‌.
డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ అవ్రిల్‌ హెయిన్స్‌.
ఐరాసలో యూఎస్‌ దౌత్యవేత్త లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌.
నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జేక్‌ సల్లివన్‌.
చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రాన్‌ క్లెయిన్‌.
కోట్ల ఓట్లతో గెలిచిన అధ్యక్షుడు

ఇక ‘‘ థ్యాంక్స్ గివింగ్ ’’‌ను పురస్కరించుకుని ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు.ఈ ఏడాది ప్రజాస్వామ్యానికి సవాలుగా నిలిచిందన్నారు.కరోనా సంక్షోభ సమయంలోనూ ప్రజలు ఎన్నికల్లో పాల్గొన్నారని బైడెన్ ప్రశంసించారు.కాగా అమెరికాలో ప్రతి ఏడాది నవంబర్‌లో థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీ.

ప్రజలకు, ప్రకృతికి, పంచభూతాలకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తారు.దీనిలో భాగంగా బుధవారం డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగిన కార్యక్రమంలో జో బైడెన్ పాల్గొన్నారు.

#LindaThomas #Biden Cabinet #April Heins #Kamala Harries #Joe Biden

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు