గ్రీన్‌కార్డులు, శాశ్వత నివాసంపై ట్రంప్ నిషేధం: భారతీయులకు వరమేనట, ఎలాగంటే ..!!  

us President donald trumps green card-ban-could-help-indians-next-year, Indian, Donald Trump, Immigrations, Visa, Greencard Holders, H1B Visa, America - Telugu America, Donald Trump, Greencard Holders, H1b Visa, Immigrations, Indian, Visa

2020 చివరి వరకూ అమెరికాలో గ్రీన్‌కార్డులు, శాశ్వత నివాస పర్మిట్లు నిలిపివేస్తూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఇది విదేశీయులు, ముఖ్యంగా భారతీయులపై పెను ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమైంది.

TeluguStop.com - Us President Donald Trumps Green Card Ban Could Help Indians Next Year

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే ఇది అంతిమంగా భారత జాతీయులకు మేలే చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుత ఇమ్మిగ్రేషన్, వీసా నిబంధనల ప్రకారం సెప్టెంబర్ నాటికి ఉపయోగించని కుటుంబ ఆధారిత శాశ్వత నివాస కార్డులను అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే తదుపరి ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగ ఆధారిత కోటాకు మళ్లిస్తారు.

TeluguStop.com - గ్రీన్‌కార్డులు, శాశ్వత నివాసంపై ట్రంప్ నిషేధం: భారతీయులకు వరమేనట, ఎలాగంటే ..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం గ్రీన్‌కార్డులపై నిషేధం కారణంగా యూఎస్‌లో ఇటువంటి వలసదారులు ఈ ప్రక్రియ చివరి దశలకు అప్లయ్ చేసుకోవడానికి అనుమతించేలా ప్రాధాన్యత తేదీలు ముందుకు తీసుకువస్తారని న్యాయ నిపుణుల అంచనా.ప్రాధాన్యత తేదీల్లో ఇది భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందని వారు చెబుతున్నారు.

దీనిని బట్టి 1,10,000 గ్రీన్‌కార్డులు ఉపాధి ఆధారిత కోటా కిందకు మళ్లించే అవకాశం వుందట.

కాగా ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ మైగ్రేంట్స్ కోసం కుటుంబసభ్యులతో సహా మొత్తం లక్షా 40 వేల గ్రీన్‌కార్డులను అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా జారీ చేస్తోంది.ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న సుమారు పది లక్షల మంది వలసదారులు, వారి కుటుంబసభ్యులు.గ్రీన్‌కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్నారు.

వీటిలో భారతీయుల వాటా 3 లక్షలు.వీరంతా మనదేశం నుంచి అగ్రరాజ్యానికి వలసవెళ్లి హెచ్ 1 బీ వీసాపై అక్కడ శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

వేచి వున్న వారి జాబితాలో అత్యథికులు మనవారే.

ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం భారతీయులకు 7 శాతం కోటా లభించనుండగా, ఇతర జాతీయులు వారి వారి కోటాలను వుపయోగించుకోని పక్షంలో నిరీక్షణ జాబితాను క్లియర్ చేసేందుకు ఉపయోగిస్తారు.

దీనిని క్లియర్ చేస్తే భారతీయులకే పెద్ద సంఖ్యలో లాభం కలిగే అవకాశం వుందని నిపుణులు అంటున్నారు.

#Indian #Immigrations #H1b Visa #Donald Trump #America

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Us President Donald Trumps Green Card Ban Could Help Indians Next Year Related Telugu News,Photos/Pics,Images..