కుట్ర కేసులో కాంగ్రెస్‌కు అబద్ధాలు: ట్రంప్ మాజీ సలహదారుకు జైలుశిక్ష

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, ఆయన మాజీ సలహాదారు రోజర్ స్టోన్‌కు యూఎస్ జిల్లా కోర్టు 40 నెలల జైలు శిక్ష విధించింది.2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించేందుకు గాను స్టోన్ రష్యాతో కలిసి కుట్ర పన్నారంటూ ఆయన గత కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఈ కుట్రపై నమోదైన కేసులో యూఎస్ కాంగ్రెస్ దర్యాప్తునకు సిద్ధమైంది.అయితే స్టోన్ తన పలుకుబడితో దానిని అడ్డుకున్నట్లు రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.

 Us President Donald Trumps Adviser Roger Stone Jailed-TeluguStop.com

ట్రంప్ కోసం స్టోన్, రష్యా అధినాయకత్వంతో కలిసి కుట్ర పన్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష డెమొక్రాట్ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు.ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయడం, అమెరికన్ కాంగ్రెస్‌కు అవాస్తవాలు చెప్పడమే కాకుండా హౌస్ దర్యాప్తును అడ్డుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.

దీనిపై విచారించిన కోర్టు నవంబర్‌లో స్టోన్‌ను దోషిగా తేల్చింది.తుది తీర్పు వెలువరించే సమయంలో న్యాయమూర్తి అమీ బెర్మాన్ జాక్సన్ మాట్లాడుతూ…….

 Us President Donald Trumps Adviser Roger Stone Jailed-కుట్ర కేసులో కాంగ్రెస్‌కు అబద్ధాలు: ట్రంప్ మాజీ సలహదారుకు జైలుశిక్ష-Telugu NRI-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కేసు విషయంలో రాజకీయ ఒత్తిడిని పెంచేందుకు రోజర్ పాల్పడిన చర్యలతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.మరోవైపు ట్రంప్ విజయం సాధించేందుకు గాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహకరించలేదని తాజాగా రుజువైంది.

కాగా రోజర్ స్టోన్‌కు జైలు శిక్ష నేపథ్యలో అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.దేశాధినేతగా తనకున్న విశిష్టాధికారాలతో స్టోన్‌ను క్షమిస్తానని చెప్పారు.ఆయన ఎలాంటి తప్పు చేసి ఉండరని తాను విశ్వసిస్తున్నానని, త్వరలోనే అన్ని ఇబ్బందులను అధిగమించి స్టోన్ బయటకు వస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.సరైన ఆధారాలు లేకుండా నిర్ణయం తీసుకుంటే అది న్యాయవ్యవస్థకే కళంకమని ఆయన వ్యాఖ్యానించారు.

#DonaldTrumps #Jail #Donald Trump #Roger Stone

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు