ట్రంప్ మరో కీలక సంతకం..ఇక అమెరికాకి ఆ అవసరం లేదట..!!  

Trump Signs Executive Order to Boost U.S. Production of Essential Medicine, U.S. Production, American factories, President Trump - Telugu American Factories, President Trump, Trump Signs Executive Order To Boost U.s. Production Of Essential Medicine, U.s. Production

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా ఎంట్రీ ఇవ్వకముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అందరికి గుర్తు ఉండే ఉంటాయి. కరోనా మహమ్మారి అమెరికాలోకి వస్తే సమర్ధవంతంగా ఎదుర్కుంటాం అంతేకాదు కరోనాని తరిమి కొట్టే అన్ని రకాల వ్యవస్థలు తమవద్ద ఉన్నాయని ట్రంప్ మీడియా సాక్షిగా ప్రకటించారు.

TeluguStop.com - Us President Donald Trump Signs Production Of Essential Medicine

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ క్రమంలోనే అమెరికాలో కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో ఒక్క సారిగా పరిస్థితులు మారిపోయాయి.అమెరికాలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవడంతో ఒక్క సారిగా వైద్య పరికరాల కొరత ఏర్పడింది.

TeluguStop.com - ట్రంప్ మరో కీలక సంతకం..ఇక అమెరికాకి ఆ అవసరం లేదట..-Telugu NRI-Telugu Tollywood Photo Image

అంతేకాదు.

వైద్యులకి కనీస వైద్య సామాగ్రి అందించడంలో కూడా ట్రంప్ సర్కార్ విఫలమయ్యిందని చెప్పాలి.

దాంతో ఈ పరిస్థితుల నుంచీ బయటపడటానికి మందులను, వైద్య పరికరాలను విదేశాల నుంచీ దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.దాంతో ట్రంప్ పై ఇంటా బయటా విమర్శలు మొదలయ్యాయి.

కరోనాని సమర్ధవంతగా ఎదుర్కుంటామని చెప్పిన ట్రంప్ కేవలం వైద్య పరికరాలకోసం విదేశాలపై ఆధారపడ్డారు అంటూ మండిపడ్డారు.ఈ క్రమంలోనే ట్రంప్ ఎవరూ ఊహించని విధంగా ఓ కీలక ఒప్పందంపై సంతకం చేశారు.

అమెరికాలోని అమెరికన్ ఫ్యాక్టరీస్ తయారు చేసే ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను అంటే వైద్య పరికరాలు, మాస్కులు, వైద్యులు ఉపయోగించే అధునాతన పరికరాలు ఇలా అన్నిటిని అమెరికన్ ఫ్యాక్టరీనుంచీ అమెరికా కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.అయితే కొన్ని నెలల ముందే ట్రంప్ ఈ ప్రతిపాదన తీసుకురాగా ఎంతో మంది సామాజిక వేత్తలు, అలాగే వ్యాపార వేత్తలు ఈ ప్రతిపాదనని వ్యతిరేకించారట దాంతో ఈ అనుమతులపై సంతకం చేయడానికి ఇంత సమయం పట్టిందని ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాలో వైద్య సంభందిత పరికరాలు, ఔషదాలకి కొరత ఉండదని అంటున్నారు నిపుణులు.

#U.S. Production #President Trump #TrumpSigns

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Us President Donald Trump Signs Production Of Essential Medicine Related Telugu News,Photos/Pics,Images..