వైట్ హౌస్ చీఫ్‌ ఆఫ్ స్టాఫ్‌గా మార్క్ మెడోస్‌‌‌ను నియమించిన ట్రంప్

వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌‌గా మిక్ ముల్వాని స్థానంలో కన్జర్వేటివ్ చట్టసభ సభ్యుడు మార్క్ మెడోస్‌‌‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించారు.కరోనా వైరస్‌తో ప్రస్తుతం అగ్రరాజ్యం వణుకుతున్న సమయంలో ట్రంప్ తిరిగి ఎన్నికల బరిలో నిలిచిన దశలో మెడోస్‌ బాధ్యతలు స్వీకరించారు.

 Us President Donald Trump Mark Meadows White House Chief Staff-TeluguStop.com

ట్రంప్ మూడేళ్ల పదవీకాలంలో మెడోస్ నాల్గో చీఫ్.ఆయన ఉత్తర కరోలినాకు చెందిన యూఎస్ ప్రతినిధుల సభలో సభ్యుడు.

అలాగే అభిశంసన సమయంలో అధ్యక్షుడికి అండగా నిలిచారు.
మెడోస్‌ను వైట్ హౌస్ చీఫ్‌‌గా నియమిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు.

‘‘ అతను రాజకీయ నాయకుడిగానే కాకుండా అద్భుతమైన ప్రతిభావంతుడని ట్రంప్ ప్రశంసించారు.అదే సమయంలో ఇప్పటి వరకు వైట్ హౌస్ చీఫ్‌గా ఉన్న ముల్వానిని ఉత్తర ఐర్లాండ్‌కు ప్రత్యేక అమెరికా రాయబారిగా పేర్కొన్నారు.

ఈ నెలాఖరులో సెయింట్ పాట్రిక్స్ డే వేడుకలకు ఐరిష్ ప్రధాన మంత్రి లియో వరద్కర్‌ అమెరికా పర్యటనకు విచ్చేస్తున్న సమయంలో ముల్వాని నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

Telugu Donald Trump, Nri, Donaldtrump, White Staff-

ఫ్లోరిడా పామ్ బీచ్‌లోని తన మార్ ఎ లాగో క్లబ్‌కు చేరుకున్న కొద్దిసేపటికి డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటించారు.కాంగ్రెస్ సభ్యుడు మార్క్ తనకు చాలా కాలంగా తెలుసునని, ఆయనతో కలిసి తాను గతంలో పనిచేశానని అధ్యక్షుడు ట్వీట్ చేశారు.అదే సమయంలో తనకు పాలనతో పాటు అనేక విషయాల్లో సహకరించినందుకు ముల్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ముల్వాని తీరు పట్ల ట్రంప్ కొద్దిరోజులుగా అసహనంగా వున్నారు.ఉక్రెయిన్‌కు అమెరికా సహాయాన్ని నిలిపివేయడం ద్వారా డెమొక్రాటిక్ పత్యర్ధి జో బిడెన్‌పై దర్యాప్తు చేయడానికి ఉక్రెయిన్‌ను ఒప్పించాలని ట్రంప్ కోరిన విషయాన్ని ముల్వాని వైట్ హౌస్‌‌లో మీడియాకు చెప్పడంతో అధ్యక్షుడు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దక్షిణ కరోలినాకు చెందిన మాజీ కన్జర్వేటివ్ చట్టసభ సభ్యుడు ముల్వాని.జాన్ కెల్లీ స్థానంలో ఏడాదికి పైగా వైట్ హౌస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.ముల్వానీ నియామకంపై మెడోస్‌కు స్పష్టమైన అవగాహన ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ అన్నారు.మెడోస్ 2017-2019 నుంచి కన్జర్వేటివ్ హౌస్ ఫ్రీడం కాకస్‌కు అధ్యక్షత వహించారు.

ముల్వానిని 2018 డిసెంబర్‌లో తాత్కాలిక చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంపిక చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube