అంతర్జాతీయ ఫైనాన్స్‌ సంస్థలో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి: ట్రంప్ ప్రతిపాదన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారతీయ అమెరికన్లకు, భారత సంతతి ప్రజలకు కీలక పదవులు ఇస్తూ వస్తున్నారు.కొద్దిరోజుల క్రితం కూడా భారత సంతతికి చెందిన గీతా పాసిని ఇథియోపియాలో అమెరికా రాయబారిగా నియమించారు.

 Us President Donald Trump Intends To Nominate Indian-american Deven Parekh To To-TeluguStop.com

తాజాగా మరో ఇండో అమెరికన్ దేవన్ పరేఖ్‌‌ను ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (ఐడీఎఫ్‌సీ) డైరెక్టర్ల బోర్డులో సభ్యునిగా నామినేట్ చేయాలని ట్రంప్ భావిస్తున్నారు.

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఇన్‌సైట్ పార్ట్‌నర్స్‌‌లో మేనేజింగ్ డైరెక్టర్‌‌గా ఉన్న పరేఖ్‌… ఐడీఎఫ్‌సీ బోర్డులో మూడేళ్ల పాటు పదవిలో ఉంటారు.

పరేఖ్ 2016 నుంచి 2018 వరకు ఓవర్సీస్ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పోరేషన్ బోర్డులో పనిచేశారు.అంతకుముందు 2010 నుంచి 2012 వరకు యూనైటెడ్ స్టేట్స్ ఎగుమతి- దిగుమతి బ్యాంక్ సలహా బోర్డు సభ్యునిగా వ్యవహరించారు.

పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్ నుంచి దేవన్ ఎకనామిక్స్‌లో బీఎస్ పట్టా పొందారు.

Telugu Deven Parekh, Idfc, Indian American, Trump, Donaldtrump-Telugu NRI

కాగా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ప్రత్యర్దిగా ఉన్న డెమొక్రటిక్ పార్టీ నేత జో బిడెన్ కోసం పరేఖ్ గత నెలలో వర్చుల్ ఫండ్ రైజర్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు.గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా పరేఖ్ ఫండర్ రైజర్‌గా పనిచేశారు.1992 -2000 మధ్యకాలంలో బెరెన్సన్ మినెల్లా & కంపెనీలో ప్రిన్సిపాల్, వైస్‌ ప్రెసిడెంట్‌ పదవులతో సహా అనేక పదవులను నిర్వహించారు.1991 నుంచి 1992 వరకు బ్లాక్‌స్టోన్ గ్రూప్‌కు ఫైనాన్షియల్ అనలిస్ట్‌గానూ వ్యవహరించారు.ఇన్‌సైట్ పార్ట్‌నర్స్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రపంచవ్యాప్తంగా అప్లికేషన్ సాఫ్ట్‌వేర్, డేటా, కన్జ్యూమర్ ఇంటర్నెట్ వ్యాపారాలలో పరేఖ్ పెట్టుబడులను నిర్వహిస్తున్నారు.

యూరప్, ఇజ్రాయెల్, చైనా, ఇండియా, లాటిన్ అమెరికా, రష్యాలలో దేవన్ పెట్టుబడులు పెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube