అభినవ నీరో: కరోనాతో జనాలు చస్తుంటే.. గోల్ఫ్ ఆడిన ట్రంప్, అమెరికన్ల విమర్శలు

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నారని ఒక సామెత.అచ్చం ఇలాగే చేశారు డొనాల్డ్ ట్రంప్.

 Us President Donald Trump Plays Golf Amid Covid-19 Pandemic As Us Death Count Ne-TeluguStop.com

కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా నష్టపోయిన దేశం ఏదైనా ఉందంటే అది అమెరికాయే.అగ్రరాజ్యం ఇంతటి సంక్షోభంలో మునగడానికి కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే.

కోవిడ్ 19 వ్యాప్తి, దూకుడును అంచనా వేయడంలోనూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ ట్రంప్ విఫలమయ్యారని ప్రపంచం కోడై కూస్తోంది.

Telugu Covid, Count, Donald Trump, Donaldtrump-

తనపై ఇన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ట్రంప్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.ఇప్పటికే అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 17 లక్షలు, మరణాలు లక్షకు చేరువవుతుండటం కలవరపరిచే అంశం.మామూలుగా అయితే ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో దేశాధినేతకు కాలు చెయ్యి ఆడదు.

కానీ అక్కడుంది డొనాల్డ్ ట్రంప్.ఆయన వ్యవహారశైలి అంతా డిఫరెంట్.

చావు కళ్ల ముందు ఉన్నా చిరునవ్వు పెదాల మీద ఉండాలన్నట్లు… జనాలు కరోనాతో పిట్టల్లా రాలుతుంటే ట్రంప్ గోల్ఫ్ ఆడి సేదతీరుతున్నారు.

Telugu Covid, Count, Donald Trump, Donaldtrump-

శనివారం ఉదయం ట్రంప్ వర్జీనియాలోని నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు చేరుకున్నారు.కనీసం మాస్కు కూడా ధరించకుండా అక్కడికి వచ్చారని తెలుస్తోంది.ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రంప్‌ను ఆడేసుకుంటున్నారు.

కరోనాతో జనం చస్తుంటే, వాళ్లను కాపాడాల్సిన దేశాధినేత గోల్ఫ్ ఆడటమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube