ట్రంప్ పై మరో సారి ఫైర్ అయిన ఆంటోని పౌచీ..!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై మరోసారి అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని పౌచీ విరుచుకుపడ్డారు.అనుకున్న లక్ష్యం పూర్తి చేయలేని ట్రంప్ ఓ అధ్యక్షుడా అంటూ మండిపడ్డారు.

 Us President Donald Trump, Epidemiologist Anthony Pouchi, Corona In America, Cor-TeluguStop.com

కరోనా ప్రపంచం మొత్తాన్ని కబళిస్తున్న సమయంలో ,అప్పటికి అమెరికాలో కరోనా ఎంట్రీ ఇవ్వకముందే ఆంటోని పౌచీ ట్రంప్ ను ముందే హెచ్చరించినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఫలితంగానే ఇన్ని మరణాలు జరిగాయని గతంలోనే పౌచీ ట్రంప్ పై విమర్శలు చేశారు.అయితే ప్రస్తుతం నిపుణులు ఎంతో కష్టపడి అమెరికన్స్ ను కాపాడుకోవడానికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తే.

అమెరికన్స్ కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచలేక పోవడం పై మరో సారి ఫైర్ అయ్యారు పౌచీ

అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగావంటగా జరగడం లేదని, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందోనని అందరూ ఎదురు చూసిన తరుణంలో వ్యాక్సిన్ వచ్చిన తరువాత కూడా అమెరికన్స్ కు సకాలంలో అందించలేకపోవడం దారుణమని అన్నారు.వ్యాక్సినేషన్ ప్రారంభించక ముందు డిసెంబర్ నాటికి అమెరికాలో ముందుగా 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేస్తామని బీరాలు పలికిన ట్రంప్ ఆయన యంత్రాంగం ఇప్పటి వరకూ కేవలం 2.8 మిలియన్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.ట్రంప్ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు పౌచీ.

Telugu Corona America, Corona Vaccine, Trump, Donald Trump-Latest News - Telugu

వ్యాక్సిన్ లేక పోవడం వలన చాలా దేశాలలో మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, వాటితో పోల్చుకుంటే మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా మన దేశంలో అన్నిటికంటే అధికంగానే మరణాల రేటు ఎక్కువగా ఉందని ఆవేదన చెందారు.కేవలం వ్యాక్సిన్ వేగవంతంగా పూర్తి చేయకపోవడం వలన మరిన్ని మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే , ట్రంప్ ఇప్పటికైనా మేలుకోక పొతే మరింతమంది అమెరికన్స్ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని , ట్రంప్ సర్కార్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube