బిడెన్ సంచలన వ్యాఖ్యలు..ఇక శ్వేత జాతీయుల ఆటలు సాగవు...

అమెరికా అధ్యక్షుడు బిడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఎన్నో సంచలన నిర్ణయాలని తీసుకుంటున్నారు.బిడెన్ తీసుకునే నిర్ణయాలు గతంలో ఏ అధ్యక్షుడు బహుశా తీసుకుని ఉండరని నిపుణులుసైతం అంటన్నారు.

 Us President Biden Visit Tulsa Greenwood Cultural Center , America, Biden, Fede-TeluguStop.com

తాజాగా బిడెన్ తీసుకున్న మరో నిర్ణయం ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరిచింది.అంతేకాదు శ్వేత జాతీయులని ఉద్దేశించి బిడెన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.

1921 లో అమెరికాలోని తుల్సా లో జరిగిన నల్లజాతీయుల ఊచకోతను ఇప్పటికి అమెరికాకు అవమాన కరమైన ఘటనే.ఈ ఘటన జరిగి 100 ఏళ్ళు అవడంతో ఆ ప్రాంతంలో ఉన్న గ్రీన్ వుడ్ కల్చర్ సెంటర్ ను బిడెన్ సందర్శించారు.

ఈ క్రమంలో ఆయన శ్వేత జాతీయ జాత్యహంకారం పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.శ్వేత జాతి జాత్యహంకారం ఉగ్రవాదంతో సమానమని ఇది అమెరికాకు పెను ముప్పుగా మారిందని వ్యాఖ్యానించారు.

ఈ పరిస్థితులను తాను రూపు మాపుతానని అందుకోసం తగిన చర్యలు చేపడుతానని హామీ ఇచ్చారు.

Telugu America, Biden, Greenwood, Kamala Harris-Telugu NRI

అంతేకాదు.మైనారిటీలు సొంతంగా నడిపే వ్యాపారాలకు ఫెడరల్ సాయం పెంచేలా చేస్తానని హామీ ఇచ్చారు.ఈ క్రమంలో ఆనాడు ఊచకోత జరిగిన సమయం మొదలు నేటికి బ్రతికి ఉన్న ముగ్గురు నల్లజాతీయులని బిడెన్ కలిసారు.

ఏ అధ్యక్షుడు ఇప్పటి వరకూ ఈ ప్రాంతాన్ని సందర్శించలేదని మొదటి సారిగా తానే ఇక్కడకు వచ్చానని అన్నారు బిడెన్.ఒక శ్వేత జాతి మహిళ ఓ నల్లజాతీయుడు తనపై హత్యాచారం చేశాడనే ఆరోపణతో ఇంతటి మారణ హోమం అప్పట్లో జరిగిందని ఈ ఘటనలో సుమారు 300 మంది నల్లజాతీయులను ఊచకోత కోసారని అన్నారు బిడెన్.

అప్పట్లో ఆ ప్రాంతంలో ఎన్నో ఆస్తులు ధ్వంసం అయ్యాయని, ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు 1000 కోట్ల డాలర్ల నిధులు విడుదల చేయనున్నట్టు తెలిపారు బిడెన్.ఇకపై నల్లజాతీయుల తరుపున నేను కమలా హారీస్ ఉంటామని శ్వేత జాతీయుల ఆటలు సాగవని ప్రకటించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube