మారని అమెరికా పోలీసులు: మెడపై మోకాలు తొక్కిపెట్టి భారతీయుడి అరెస్ట్, విమర్శలు

జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో అమెరికాలో నిందితులు లేదా నిరసనకారులను నియంత్రించేందుకు అవలంభిస్తున్న కఠిన పద్ధతికి స్వస్తి పలకాలని ఓ వైపు నిరసనలు కొనసాగుతున్నాయి.ఇంత రాద్ధాంతం జరుగుతున్నా పోలీసుల వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

 Us Police Brutality: Protests Erupt Over Cop Kneeling On Indian-origin Man's Nec-TeluguStop.com

తాజాగా న్యూయార్క్ పోలీసులు భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని ఇదే తరహాలో అరెస్ట్ చేయడం విమర్శలకు దారి తీసింది.మెడపై మోకాలు పెట్టి.

చోక్‌హోల్డ్ విధానానికి దగ్గరలో అత్యంత కర్కశంగా వ్యవహరించడం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి.

యుగేశ్వర్ గైన్‌దర్‌పెర్సాడ్‌ను పోలీసులు షెనెక్టాడి నగరంలో సోమవారం అరెస్ట్ చేశారు.

ఈ సమయంలో తీవ్రగాయాల పాలైన గైన్‌దర్‌పెర్సాడ్‌ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.అనంతరం యుగేశ్వర్.

షెనెక్టాడి పోలీసు ప్రధాన కార్యాలయం వెలుపల నిరసనకు దిగాడు.సుమారు 100 మంది పాల్గొన్న ఈ ధర్నాలో బాధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

కాగా ఈ ఘటనపై డెమొక్రాటిక్ ప్రతినిధుల సభ సభ్యుడు పాల్ టోంకో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మరోవైపు పోలీసుల తీరు న్యూయార్క్ రాష్ట్ర చట్టాన్ని ఉల్లంఘించడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.

నిందితులు లేదా అనుమానితులను అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు చోక్‌హోల్డ్ విధానం లేదా అతని శ్వాసకు ఇబ్బంది కలిగే పద్ధతులను ఉపయోగించరాదంటూ జూన్‌లో చట్టాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

Telugu George Floyd, Indian Origin, York, Brutalityerupt-

ఈ ఘటనపై షెనెక్టాడి పోలీస్ చీఫ్ ఎరిక్ క్లిఫోర్డ్ ‌స్పందించారు.యుగేశ్వర్ కారు టైర్లను దొంగిలిస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందని… దీంతో తాము అతనిని అరెస్ట్ చేసేందుకు వెళ్లామని ఆయన చెప్పారు.ఆ సమయంలో యుగేశ్వర్ నుంచి ప్రతిఘటన ఎదురవ్వడంతో కాస్త కఠినంగానే వ్యవహరించామని ఎరిక్ వెల్లడించారు.

అతనిని అదుపు చేయడానికి నెక్‌హోల్డ్‌ను ఉపయోగించారని.అయితే యుగేశ్వర్ శ్వాస లేదా రక్త ప్రసరణ వ్యవస్థను దెబ్బ తీసేలా తాము వ్యవహరించలేదని ఆయన వివరణ ఇచ్చారు.

ఈ అరెస్ట్‌లో పాల్గొన్న పోలీసుల బాడీకెమెరాల నుంచి ఈ వీడియోను బుధవారం విడుదల చేశారు. బాడీక్యామ్‌ వీడియోలను సమీక్షించేందుకు గాను అంతర్గత విచారణకు ఆదేశించామని దీనిపై జిల్లా ప్రాసిక్యూటర్‌తో పోలీస్ శాఖ సంప్రదింపులు జరుపుతోందని ఎరిక్ పేర్కొన్నారు.

కాగా యుగేశ్వర్‌పై మోకాలిని ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారిని డెస్క్ డ్యూటీకి తరలించినట్లు డైలీ గెజిట్ కథనాన్ని ప్రచురించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube