టీనేజర్‌ మరణంతో వారి కుటుంబానికి రూ. 2,624 కోట్ల పరిహారం ఇప్పించిన కోర్టు

అమెరికాలోని ఓ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో ఫ్రీ ఫాల్‌ టవర్‌ డ్రాప్‌ రైడ్‌( Freefall Tower Drop Ride ) పై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందిన యువకుడి కుటుంబానికి రూ.2,624 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

దింతో ఈ విష్యం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

ఈ రైడెను ఫ్లోరిడాలోని ఐకాన్ పార్క్‌లో( ICON Park ) ఫన్‌టైమ్ హ్యాండిల్స్ నిర్వహిస్తుంది.ఈ రైడ్ 400 అడుగుల ఎత్తు వరకు వెళ్లి గంటకు 112 కిలోమీటర్లవేగంతో కిందకు దూసుక వెళ్తుంది.

ఇకపోతే, 2022 మార్చిలో 14 ఏళ్ల టైర్‌ శాంప్సన్‌( Tyre Sampson ) తన తోటి ఫుట్‌బాల్‌ టీమ్‌తో ఈ రైడ్‌ ఎక్కాడు.173 కిలోల బరువున్న శాంప్సన్ నిబంధనలను ఉల్లంఘించి రైడ్ చేయడానికి అనుమతించారు.నిబంధనలను ఉల్లంఘించి అంటే నిజానికి, 129 కిలోల కంటే ఎక్కువ బరువున్న వారిని ఈ రైడెకు అనుమతించరు.

ఆ రోజు రైడ్ లో రెండుసార్లు సురక్షితంగా కిందకి పైకి దిగిన శాంప్సన్, మూడోసారి అతడు బ్యాలెన్స్ కోల్పోయి, టవర్ 70 అడుగుల ఎత్తులో ఉండగా అతను బాలన్స్ కోల్పోయాడు.దాంతో అతడు పైనుండి కింద పడి అక్కడికక్కడే మరణించాడు.

Advertisement

అధిక బరువు, సీటు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు శిక్షగా ఫన్‌టైమ్‌కు ఏకంగా 310 మిలియన్ డాలర్స్ జరిమానా విధించబడింది.ఈ మొత్తంలో, శాంప్సన్ తల్లిదండ్రులు ఒక్కొక్కరికి 155 డాలర్స్ మిలియన్ల పరిహారం అందజేయాలని కోర్టు తీర్పునిచ్చింది.దింతో ఈ విషయం కాస్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న సోషల్ మీడియా నెటిజన్స్ వివిధరకాలుగా స్పందిస్తున్నారు.సదరు కంపెనీకి సరియన్ శిక్ష విధించారని కొందరు కామెంట్ చేస్తుండగా.

మరికొందరు అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్ చేస్తున్నారు.

నూతన సంవత్సరం ఎర్రటి కాగితంపై ఇలా రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది!
Advertisement

తాజా వార్తలు