68 వేల మంది భారతీయులు ఇంటికేనా...!!!  

Us Opt Ends In April - Telugu April, Green Card, H1b Visa, Indians, Nri, Sofware Engineers, Us,

అమెరికాలో స్థిరపడాలనే కోరికతో అమెరికా వెళ్లి , ఉన్నత విద్యను పూర్తి చేసి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అర్హత సాధించి ఉద్యోగం చేస్తున్న సుమారు 68 వేల మంది భారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగులను వెనక్కి పంపించడానికి అమెరికా సిద్ధంగా ఉందని తెలుస్తోంది.మూడేళ్ళ కాల వ్యవధి కోసం ఇచ్చే ఈ “ఓపిటి” ఈ ఏడాదితో పూర్తి అవుతున్న నేపథ్యంలో భారతీయ టెకీ లలో ఆందోళన నెలకొందని అంటున్నారు.
ఇప్పటికే రెండుసార్లు హెచ్ -1బీ వీసా అవకాశం కోల్పోయిన ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మరొకసారి హెచ్ -1బీ వీసా పొందడానికి చివరి అవకాశాన్ని కలిగి ఉన్నారు, అది కూడా ఏప్రిల్ వరకే అవకాశం ఉందని అప్పటికీ మారకపోతే స్వదేశానికి తిరిగి వెళ్లడం లేదా మళ్లీ విశ్వవిద్యాలయంలో చేరి పి హెచ్ డి చేయడమే వీరి ముందున్న ప్రత్యామ్నాయంగా తెలుస్తోంది… అయితే
ఈ అరవై ఎనిమిది వేల మందిలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు అత్యధికంగా ఉన్నారని వారు ఎమ్మెస్ కోర్సు చేయడానికి సానుకూలంగా లేరని తెలుస్తోంది వీరికి ఒకవేళ వీసా రాకపోతే భారత్ తిరిగి వెళ్లడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని అంటున్నారు నిపుణులు.2015 – 16 లో అమెరికా ఉన్నత విద్య కోసం వెళ్లిన వారు ఇప్పుడు ఈ వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది…ఇదిలా ఉంటే
ఓపిటి గడువు దాటిన వారిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 20 నుంచి 24 వేల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు నిపుణులు.వీసా గనుకా ఈసారికి రాకపోతే స్వదేశానికి వెళ్లి మళ్లీ హెచ్ -1బీ దరఖాస్తు చేసుకోవచ్చని భావిస్తున్నారట.ఆర్థికంగా ఇబ్బంది లేని భారతీయ టెకీలు అక్కడే ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది.

Us Opt Ends In April - Telugu April, Green Card, H1b Visa, Indians, Nri, Sofware Engineers, Us, -Telugu NRI-Telugu Tollywood Photo Image

తాజా వార్తలు