“తానా” కు రూ.28 కోట్ల భారీ విరాళం ప్రకటించిన అమెరికన్ హాస్పటల్..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని తెలుగు సంఘాలలో అమెరికాలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.అతి పెద్ద తెలుగు సంఘంగా పేరొందిన తానా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది.

 Us North Western Medicine Org Donate 28cr To Tana-TeluguStop.com

ముఖ్యంగా తెలుగు వారి అభ్యున్నతి, తెలుగు బాష , సంస్కృతీ, సాంప్రదాయాలను విదేశాలలో సైతం అంగరంగ వైభవంగా జరుపుకోవడం, అక్కడి తెలుగు వారి పిల్లలకు తెలుగు బాషను నేర్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలును తానా నిర్వహిస్తోంది.తెలుగు బాషను నేర్పించడం కోసం తానా ఏర్పాటు చేసిన పాటశాల అమెరికాలో ఎంతో మందికి విధ్యాభోదన చేస్తోంది.

కేవలం తెలుగు వారికోసమే కాకుండా అమెరికాలోని అమెరికన్స్ కు కుడా తమకు తోచిన సాయం చేస్తోంది.కరోనా లాక్ డౌన్ సమయంలో తానా ఎంతోమంది అమెరికన్స్ కు ఫుడ్ డ్రైవ్ రూపంలో సాయం అందించింది.

 Us North Western Medicine Org Donate 28cr To Tana-“తానా” కు రూ.28 కోట్ల భారీ విరాళం ప్రకటించిన అమెరికన్ హాస్పటల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్న తానాను గుర్తించిన అమెరికన్ హాస్పటల్ భారీ విరాళం అందించింది.

చికాగోకు చెందిన నార్త్ వెస్టర్న్ మెడిసిన్ సంస్థ తానా సేవలకు గాను $3.85 మిలియన్ డాలర్లు విరాళంగా ప్రకటించింది.భారత కరెన్సీలో మొత్తం విలువ రూ.28 కోట్ల పై మాటే.ఈ భారీ మొత్తంలో విలువైన వైద్య సామాగ్రిని అందించడానికి ముందుకు వచ్చింది.

కోవిడ్ సమయంలో ఎంతో మందికి రక్షణ పరికరాలు, వస్తువులు అవసరం ఉంటాయి కాబట్టి వారిని సమకూర్చేందుకు ఈ సంస్థ ముందకు వచ్చింది.బూట్లు, మాస్క్ లు , కళ్ళ అద్దాలు, ఇలా ఎన్నో వైద్య సామాగ్రి అందించనుంది.

అమెరికాలో 1972 లో ప్రారంభించబడిన ఈ సంస్థకు పలు ప్రాంతాలలో ఆసుపత్రులు ఉన్నాయి.నార్త్ వెస్టర్న్ అందించిన ఈ సాయంపై తానా కోశాధికారి కొల్లా అశోక్ సంతోషం వ్యక్తం చేశారు.

తానా మాజీ అధ్యక్షులు, చైర్మెన్ లు అందరూ ఈ సంస్థతో కలిసి తానా సేవలను వివరించామని, ఆ చర్చల ఫలితమే ఈ స్థాయిలో భారీ సాయం అందిందని, తానా పై నమ్మకం ఉంచిన నార్త్ వెస్టర్న్ మెడిసిన్ కు తానా తరుపున కృతజ్ఞతలు తెలిపారు.తెలుగు రాష్ట్రాలలో రెడ్ క్రాస్ సంస్థ తో కలిసి ఈ వైద్య పరికరాలను కీలకమైన , అత్యవసరమైన ఆసుపత్రులకు, పల్లెల్లో పలు సంస్థలు, ఆసుపత్రులకు పంపుతామని, త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని కొల్లా అశోక్ ప్రకటించారు.

#FoodDrive #USNorth #Kolla Ashok #Chicago #NorthAmerican

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు