జో బిడెన్ కు జీతం ఎంతో తెలుసా..?

అమెరికా అద్యక్షుడిగా బిడెన్ ప్రమాణ స్వీకారం చేసేశారు.అఖండమైన మెజారిటితో గెలిచిన బిడెన్ అతిరధుల సమక్షంలో బిడెన్ అనే నేను అంటూ అద్యక్షుడిగా ఇకపై కొనసాగనున్నారు.

 America New President Joe Biden, Joe Biden Salary, Joe Biden Assets,joe Biden Wi-TeluguStop.com

కమలా హారీస్ కూడా ప్రమాణస్వీకారం చేసేశారు.అమెరికా అత్యంత పెద్ద వయసు అధ్యక్షుడిగా బిడెన్ రికార్డ్ కూడా క్రియేట్ చేసారు.2009 మొదలు 2017 వరకూ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా ప్రయాణం చేసిన బిడెన్ అప్పట్లో ఉపాధ్యక్షుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
అతి చిన్న వయసులోనే అంటే 1972 లో (అప్పటికి బిడెన్ వయసు 29 ఏళ్ళు) నే బిడెన్ సెనేటర్ గా ఎన్నికయ్యారు.1973 నుంచి 2009 వరకూ ఆయన సెనేటర్ గా తన విజయ ప్రస్తానం కొనసాగించారు.అదే సమయలో అంటే 1972 లోనే క్రిస్మస్ సమయంలో తన మొదటి భార్య, కూతురు ప్రమాదంలో చనిపోయారు దాంతో అప్పటి నుంచి రైలులనే ప్రయాణం చేసేవారు.

ఆ తరువాత ఉపాధ్యాయురాలిగా ఉన్న జిల్ ను పెళ్లి చేసుకున్నారు బిడెన్.ఇదిలాఉంటే

Telugu America Salary, Joe Biden Jill-Telugu NRI

ఫోర్బ్స్ లెక్కల ప్రకారం బిడెన్ ఆస్తుల విలువ 9 మిలియన్ డాలర్లు ఉంటుదని.రెండు డెల్ వేర్ ఇళ్ళు ఉన్నాయని వాటి ఆస్తుల విలువ 4 మిలియన్ డాలర్లు ఉంటుందని తెలిపింది.సతీమణి జిల్ కు కూడా భారీ ఆదాయం ఉందని ఆమె ఆస్తుల విలువ కూడా 4 మిలియన్ డాలర్లు ఉంటుదని తెలిపింది.

ఇక బిడెన్ కు అధ్యక్షుడిగా జీతం ఎంత ఉంటుంది అనే విషయంపై అందరూ సోదిస్తున్నారు.బిడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఏటా 230,700 డాలర్లు జీతంగా పొందే వారు.

ఇప్పుడు అధ్యక్షుడిగా ప్రతీ ఏటా 400,000 డాలర్లు జీతంగా పొందనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube