అమెరికా: 5 లక్షలకు చేరువలో కరోనా మరణాలు.. ఈ విలయానికి ముగింపు లేదా.?  

US Nears 5 Lakh Coronavirus Deaths,US, Covid deaths, America, Coronavirus , Doctor Fauci, Corona death rate - Telugu America, Corona Death Rate, Coronavirus, Covid Deaths, Doctor Fauci, Us, Us Nears 5 Lakh Coronavirus Deaths

ప్రపంచంలో కరోనా కారణంగా అత్యధికంగా నష్టపోయిన దేశం అగ్రరాజ్యం అమెరికాయే. కోవిడ్ కేసులు, మరణాల్లో పెద్దన్న టాప్ ప్లేస్‌లో నిలిచాడు.

TeluguStop.com - Us Nears 5 Lakh Covid 19 Deaths

వైరస్ దేశంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉదాసీన వైఖరి కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమైంది.మధ్యలో కాస్త ఉపశమనం లభించినట్లుగా కనిపించినా.

చలికాలం ప్రవేశించడం, థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల కారణంగా అమెరికాలో కేసులు విపరీతంగా పెరిగిపోయాయి.ఒక్కమాటలో చెప్పాలంటే గతేడాది ఫిబ్రవరి- మే మధ్యకాలంలో నమోదైన కేసుల కంటే రెట్టింపు మంది కోవిడ్ బారినపడుతున్నారు.
తాజాగా అమెరికాలో కరోనా మరణాలు 5 లక్షలకు చేరువయ్యాయి.ఆదివారం నాటికి అగ్రరాజ్యంలో కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4.98 లక్షలు దాటింది.ఈ విషయాన్ని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ నివేదిక వెల్లడించింది.

TeluguStop.com - అమెరికా: 5 లక్షలకు చేరువలో కరోనా మరణాలు.. ఈ విలయానికి ముగింపు లేదా.-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అమెరికాలో శతాబ్ధం కిందట ఇన్‌ఫ్లూయెంజా మహమ్మారి సృష్టించిన విలయ తాండవం తర్వాత ఆ స్థాయిలో సంభవించిన సంక్షోభం ఇదేనని అంటు వ్యాధి విభాగం నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ తెలిపారు.
అమెరికాలో గతేడాది ఫిబ్రవరిలో తొలి కరోనా మరణం సంభవించిన విషయం తెలిసిందే.

అప్పడు మొదలైన మరణ తాండవం కేవలం తొలి నాలుగు నెలల్లోనే లక్ష మార్కును దాటింది.ఆ తర్వాత సెప్టెంబర్‌‌లో 2 లక్షలు, డిసెంబర్‌‌లో 3 లక్షల మంది కోవిడ్‌కు బలయ్యారు.

జనవరి 19న అధికార మార్పిడి జరిగే సమయానికి 4 లక్షలకు చేరుకుంది.అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే లక్ష మరణాలు చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది.

మరోవైపు దేశంలో కరోనా మృతుల సంఖ్య 5 లక్షలకు చేరువవుతున్న సందర్భంగా వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్‌ మృతులకు సోమవారం నివాళి అర్పించనున్నారు.ఈ సందర్భంగా కొద్ది సేపు మౌనం పాటించి, కొవ్వొత్తులతో నివాళులు అర్పించనున్నారు.

#America #Doctor Fauci #Covid Deaths #USNears #Coronavirus

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు