యూఎస్ నేవీ అధికారుల నోట హిందీ పాట.. అతిథుల కేరింతల, వీడియో వైరల్

భారతీయ సినిమాలకు, భారతీయ నటీనటులకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది.శ్రావ్యమైన సంగీతం, అత్యుత్తమ ప్రమాణాలు, నటీనటుల ప్రతిభ, మంచి కథలతో భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచంలోని అతిపెద్ద ఇండస్ట్రీల్లో ఒకటిగా దూసుకెళ్తోంది.

 Us Navy Members Sing Hindi Song From Popular Bollywood Movie, Indian, U.s. Chief-TeluguStop.com

మన సంగీతానికి అన్ని దేశాల్లోనూ అభిమానులున్నారు.బాలీవుడ్ పాటలకు స్టెప్పులేసిన ఎంతోమంది విదేశీయుల వీడియోలను మనం సోషల్ మీడియాలో చూశాం.

ఇప్పుడు ఈ లిస్ట్‌లో అమెరికన్ నేవీ బ్యాండ్ చేరింది.వివరాల్లోకి వెళితే.

యూఎస్ చీఫ్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ (సీఎన్ఓ) మైఖేల్ గిల్డే, అమెరికాలోని భారత రాయబారి తరంజీత్ సింగ్ సంధు శనివారం ఓ విందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యూఎస్ నేవీ బ్యాండ్ అతిథులను అలరించేందుకు హిందీ పాటను పాడింది.2004లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘స్వదేశ్’ చిత్రంలోని ‘యే జో దేశ్ హై తేరా‘ పాటను నేవీ బ్యాండ్ ఆలపించింది.ఈ వీడియోను తరంజీత్ సింగ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

దీంతో ఈ వీడియో వైరల్ అయింది.ఈ వీడియోను 3.93 లక్షల మంది వీక్షించగా.29 వేలకు పైగా మంది లైక్ చేశారు.‘స్వదేశ్‘ చిత్రంలో ఈ పాటకు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చడంతో పాటు స్వయంగా పాడారు.

కాగా.

రక్షణ, సైనిక వ్యవహారాల్లో భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా తూర్పు హిందూ మహాసముద్రంలో భారత్- అమెరికా నౌకాదళాలు విన్యాసాలు చేస్తున్న సంగతి తెలిసిందే.భారత్‌కు చెందిన శివాలిక్, లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ పీ8ఐ విన్యాసాల్లో పాల్గొన్నాయి.

అటు అమెరికా తరపున యూఎస్ఎస్ థియేడర్ రోజ్‌వెల్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ పాల్గొంది.

గతంలో దీపావళి సందర్భంగా న్యూజిలాండ్ పోలీసులు బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియో అప్పట్లో వైరల్‌ అవుతోంది.

మల్టీ కల్చరల్ కౌన్సిల్ ఆఫ్ వెల్లింగ్టన్ సంస్థ దీపావళి సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.అందులో భాగంగా కర్ గయీ చుల్, కలా చాష్మా పాటలకు పోలీసు అధికారులు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.

చిరునవ్వులు చిందిస్తూ, ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ చేసిన ఈ గ్రూప్‌ డ్యాన్స్‌ నెటిజన్లను ఆకట్టుకుంది.న్యూజిలాండ్ పోలీసులు ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube