జాతి విద్వేష దాడి.. ఉన్మాది తూటాలకు నేలకొరిగిన పది మంది, అమెరికన్ల నివాళులు

అమెరికా న్యూయార్క్‌లోని బఫెలో వున్న టాప్స్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్‌లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో పది మంది మరణించిన సంగతి తెలిసిందే.నల్లజాతీయులే లక్ష్యంగా శ్వేతజాతి ఉన్మాది ఈ ఘాతుకానికి తెగబడ్డాడు.

 Us Mourns Victims Of Racially Motivated Mass Shooting   Us, Attack , New York ,-TeluguStop.com

దుండగుడి పేరు పేటన్ జెండ్రన్, అతని స్వస్థలం న్యూయార్క్ రాష్ట్రంలోని కాంక్లిన్.సూపర్ మార్కెట్‌లో దాడికి ముందే ప్లాన్ చేసిన నిందితుడు.

అతని నివాసానికి దాదాపు 320 కిలోమీటర్ల దూరంలో వున్న బఫెలోకు వచ్చాడు.

దీనిపై బఫెలో నగర పోలీస్ కమీషనర్ జోసెఫ్ గ్రామగ్లియా మీడియాతో మాట్లాడుతూ… నల్లజాతి ప్రజలు ఎక్కడ ఎక్కువగా వున్నారన్న దానిపై నిందితుడు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు.

ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ఆధారంగా ఇది ఖచ్చితంగా జాత్యహంకార దాడిగానే భావిస్తున్నట్లు జోసెఫ్ చెప్పారు.నిందితుడి కారులో రైఫిల్, షాట్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కమీషనర్ వెల్లడించారు.బఫెలో మేయర్ బైరాన్ బ్రౌన్ మాట్లాడుతూ.సాధ్యమైనంత ఎక్కువ నల్లజాతీయుల ప్రాణాలను తీయాలనే ఉద్దేశ్యంతోనే నిందితుడు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.2015 నాటి సౌత్ కరోలినా చర్చిలో కాల్పుల ఘటనతో పాటు 2019 మార్చిలో న్యూజిలాండ్ మసీదులో 51 మందిని చంపిన ముష్కరుడి నుంచి తాను స్పూర్తి పొందానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడు.

దాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

జాత్యహంకార తీవ్రవాదాన్ని ఖండించారు.అమెరికా ఆత్మపై మాయని మచ్చగా మిగిలిపోయిన ద్వేషాన్ని పరిష్కరించడానికి అందరం కలిసి పనిచేయాలని బైడెన్ పిలుపునిచ్చారు.

మరోవైపు న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్, రాష్ట్ర అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్‌‌లు నగరంలోని ట్రూ బెతేల్ బాప్టిస్ట్ చర్చిలో కాల్పుల మృతులకు నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా హాజరయ్యారు.

అటు దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా దుండగుడి దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి జనం శ్రద్ధాంజలి ఘటించారు.ట్రూ బెతెల్ బాప్టిస్ట్ చర్చికి చేసిన వీడియో కాల్‌లో న్యూయార్క్ సెనేటర్ చార్లెస్ షుమెర్ మాట్లాడుతూ.

జాత్యహంకార దాడిని ఖండించారు.తమ సమాజం నుంచి ఆయుధాలను నిషేధించాలని తోటి చట్టసభ సభ్యులను ఆయన కోరారు.2015ల సౌత్ కరోలినాలోని నల్లజాతి చర్చిలో తొమ్మిది మందిని ఓ శ్వేతజాతి యువకుడు హతమార్చాడు.ఆ తర్వాత 2019లో టెక్సాస్‌లో 23 మందిని ఓ శ్వేతజాతీయుడు పొట్టనబెట్టుకున్నాడు.

ఆ తర్వాత నల్లజాతీయులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube