అమెరికాలో అదృశ్యమైన భారత సంతతి బాలిక క్షేమం.. 75 రోజులకు దొరికిన జాడ

అమెరికాలో అదృశ్యమైన భారత సంతతి బాలిక తన్వి( Tanvi ) మరుపల్లి కథ సుఖాంతమైంది.దాదాపు 75 రోజుల తర్వాత ఆమె ఆచూకీ తెలిసింది.

 Us Missing Indian-american Teen Tanvi Marupally Found Safe In Florida , Florida-TeluguStop.com

ఫ్లోరిడాలో తన్వి సురక్షితంగా వున్నట్లు కనుగొన్నారు.అలాగే ఆమెను కుటుంబం వద్దకు చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

టెక్ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న లే ఆఫ్‌‌ల మధ్య తన కుటుంబం ఎక్కడ దేశం నుంచి బహిష్కరించబడుతుందోననే భయంతో 15 ఏళ్ల తన్వి అర్కాన్సాస్‌లోని తన ఇంటి నుంచి పారిపోయిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఆమె చివరిసారిగా జనవరి 17న కాన్వే జూనియర్ హైస్కూల్ సమీపంలో కనిపించింది.

తన్వి ఆచూకీ లభించడం పట్ల కాన్వే పోలీస్ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ.ఈరోజు చాలా శుభదినమని, బాలిక తన కుటుంబాన్ని తిరిగి చేరుకుందన్నారు.

డేవిస్ స్ట్రీట్‌లో చివరిసారిగా కనిపించిన ప్రదేశం నుంచి చాలా మైళ్ల దూరం నడిచిన తర్వాత ఆమె జనవరి 22న కాన్సాస్ సిటీకి చేరుకుందని ఆయన తెలిపారు.కాన్సాస్‌లోని ఓ పాడుబడిన భవనంలో రెండు నెలల పాటు నివసించి.

అనంతరం ఫ్లోరిడాకు వెళ్లిందన్నారు.తరచుగా లైబ్రరీలకు వెళ్లే తన్వి అలవాటే ఆమె జాడను కనుగొనేందుకు కారణమైందన్నారు.

కాన్వే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి మార్చి 29న టంపాకు చెందిన ఓ వ్యక్తి నుంచి కీలక సమాచారం అందింది.తన్విని తాను లైబ్రరీలో గుర్తించినట్లు ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు.

దీంతో పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని.గుర్తింపును తెలుసుకునేందుకు ప్రశ్నలు వేశారు.

కాగా.తన ఉద్యోగం ప్రమాదంలో పడటంతో పాటు కుమార్తె కనిపించకుండా పోవడంతో తన్వి తండ్రి పవన్ రాయ్( Pawan Roy ) బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఆమె ఆచూకీ లభించ లేదు.దీనిపై పవన్ రాయ్ మాట్లాడుతూ.

ప్రస్తుతం అమెరికాలో ‘‘లే ఆఫ్’’ల కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం వుందన్నారు.దీంతో తమ కుటుంబం అమెరికాను విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.2022-23లో దాదాపు 3 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించారు.ఈ పరిణామాలు హెచ్ 1 బీ వీసాపై వున్న వారిని వణికిస్తున్నాయి.ఈ కేటగిరీ కింద వున్న వారు ఉద్యోగం కోల్పోతే.60 రోజుల్లో కొత్త ఉద్యోగాన్ని పొందాలి.లేనిపక్షంలో వారు అమెరికాను వదిలి వెళ్లాల్సి వుంటుంది.

Telugu Florida, Hb Visa, Indian American, Marupalli, Pawan Roy, Tanvi, Tanvi Mar

అయితే తన్వి తల్లిదండ్రులు.తమ కుటుంబ ఇమ్మిగ్రేషన్ స్థితి కారణంగా పారిపోయిందని మీడియాలో కథనలు వస్తున్నాయి.చాలా ఏళ్లుగా వీరి కుటుంబం అమెరికాలో నివసిస్తోంది.

ఈ క్రమంలో ఆ దేశ పౌరసత్వం పొందాలనే ఆశతో ప్రయత్నిస్తున్నప్పటికీ.ప్రస్తుత ఆర్ధిక మాంద్యం కారణంగా వీరి పరిస్ధితి అడకత్తెరలో పొకచెక్కలా మారిందని తన్వి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telugu Florida, Hb Visa, Indian American, Marupalli, Pawan Roy, Tanvi, Tanvi Mar

ఆమె తండ్రి పవన్ రాయ్ మరుపల్లి( Marupalli ) ఒక టెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.ఈయన కూడా లే ఆఫ్‌ను ఎదుర్కోనే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే ఆమె తల్లి శ్రీదేవి ఈదర ఉద్యోగం కోల్పోయిందని మీడియా నివేదిక చెబుతోంది.శ్రీదేవి తొలుత భారత్‌కు వచ్చి పవన్‌ రాయ్ డిపెండెంట్ వీసా ద్వారా తిరిగి అమెరికాకు వచ్చింది.

ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం.గతేడాది నవంబర్ నుంచి దాదాపు 2,00,000 మంది ఐటీ ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు.

ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలున్నాయి.అమెరికాలోని టెక్ ఇండస్ట్రీలో 30 నుంచి 40 శాతం మంది భారతీయ టెక్ నిపుణులు పనిచేస్తున్నారు.

వీరంతా హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాలపై వున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube