ట్రంప్ రిసార్ట్‌ చైల్డ్‌ పోర్నోగ్రఫి కేసులో మిలటరీ అధికారికి మూడేళ్ల శిక్ష

ఫ్లోరిడాలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన మార్ ఎ లాగో రిసార్ట్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు.రిచర్డ్ సిక్కారెల్లా 2017 ఆగస్టు నుంచి 2018 మార్చి వరకు మార్ ఎ లాగో ఇన్‌ఛార్జిగా వ్యవహరించాడు.

 Us Military Official Sentenced Over Mar A Lago Child Porn Case-TeluguStop.com

అధ్యక్షునితో పాటు వైట్ హౌస్ అధికారులతో సమాచార మార్పిడి అతని విధి.

Telugu Mar Lago, Marlago, Telugu Nri Ups, Trump-

అయితే అభ్యంతరకర రీతిలో ఉన్న ఒక చిన్నారి ఫోటోను రష్యన్ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేశాడు.ఆ బాలిక రిచర్డ్‌కు సమీప బంధువని కొన్ని పత్రికల్లో కథనాల్లో వెలువడ్డాయి.చైల్డ్ ఫోర్నోగ్రఫి అభియోగంపై రిచర్డ్‌ను న్యాయస్థానంలో హాజరుపరచగా.

అతను తను చేసిన తప్పును అంగీకరించడంతో పాటు క్షమాపణలు చెప్పాడు.

Telugu Mar Lago, Marlago, Telugu Nri Ups, Trump-

ఈ చర్య కారణంగా ఇరాక్‌లో దేశం కోసం చేసిన 15 ఏళ్ల సేవకు మచ్చ రావడంతో పాటు వివాహం ఆగిపోయిందని రిచర్డ్ పశ్చాత్తాపపడ్డాడు.కాగా.పర్సనల్ ఫోన్‌లో ఉన్న ఈమెయిల్ ద్వారా రిచర్డ్ రష్యన్ సైట్‌లోకి లాగిన్ అయినట్లు ప్రొసిక్యూషన్ కోర్టుకు ఆధారాలు సమర్పించింది.

వీటిపై స్పందించిన న్యాయస్ధానం రిచర్డ్‌ను వర్జీనియాలో లైంగిక నేరస్థుల కారాగారానికి తరలించి చికిత్సను అందించాల్సిందిగా ఆదేశించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube