రామ్ US మార్కెట్ డల్.. కారణం అదేనా..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ దేవదాస్ సినిమా నుంచి తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తున్నాడు.యువ హీరోగా వరుస క్రేజీ సినిమాలు చేస్తూ వస్తున్న రామ్ స్టార్ డం అందుకోవడంలో మాత్రం వెనకపడ్డాడు.

 రామ్ Us మార్కెట్ డల్.. కారణం అదే�-TeluguStop.com

ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ అని స్క్రీన్ మీద వేసినా అందుకు తగిన ఫలితాలు బాక్సాఫీస్ దగ్గర కనిపించడం లేదు.అంతేకాదు తను ఎంచుకుంటున్న కథల విషయంలో కూడా కొందరు రామ్ ని తప్పుపడుతున్నారు.

మంచి లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న రామ్ మాస్ కథలకే ఓకే చెప్పడంతో అతనికి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ వచ్చినా సరే యూఎస్ లో మాత్రం మార్కెట్ తగ్గిందని అంటున్నారు.రామ్ సినిమా ఒకప్పుడు యూఎస్ మార్కెట్ లో మంచి బిజినెస్ చేసేది.

కానీ ఇప్పుడు అక్కడ స్టార్ సినిమాలకే ఓ మోస్తారు బిజినెస్ జరుగుతుంది.ఈ క్రమంలో రామ్ సినిమాకు యూఎస్ లో డల్ గా బిజినెస్ జరుగుతుంది.

రామ్ మాస్ మూవీస్ చేయడమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు.యూఎస్ ఆడియెన్స్ ప్రయోగాలను ఎక్కువ ఇష్టపడతారు.

కొత్త కథలో తనకు కావాల్సిన మాస్ అంశాలు ఉండేలా చూసుకుంటే బెటర్ అంతేకాని మాస్ అంశాల కోసం రొటీన్ కథలను తీస్తే ఎలా అని అంటున్నారు.రాబోతున్న లింగుసామి సినిమాతో కూడా రామ్ మాస్ అటెంప్ట్ చేస్తున్నాడు.

అయితే తనకు ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హిట్ రాగా ఆ జోష్ లోనే ఉన్న రామ్ రెడ్ తీశాడు.తనని మాస్ హీరోగానే ఆడియెన్స్ చూస్తున్నారు అని ది వారియర్ గా వస్తున్నాడు రామ్.

యూఎస్ లో బిజినెస్ ఇప్పుడు పెరగకపోయినా రానున్న సినిమాలతో రామ్ అక్కడ ఆడియెన్స్ ని కూడా బేస్ చేసుకుని సినిమాలు చేస్తాడని చెప్పొచ్చు. ది వారియర్ కూడా హిట్ అయితే రామ్ తన మాస్ సినిమాలనే కొనసాగించే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube