అతని జుట్టు ఎంత పొడుగో.. ఏకంగా గిన్నిస్ బుక్ ఎక్కాడు!

దాదాపు రెండు దశాబ్దాల క్రితం అందరి హెయిర్ స్టైళ్లు ఒకే రకంగా ఉండేవి.కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ను ట్రై చేసే వాళ్లు అప్పట్లో చాలా తక్కువగా ఉండేవారు.

 Us Man Breaks Guinness World Record For Tallest Mohwak,us Man, Tallest Mohawk,-TeluguStop.com

అయితే అప్పటికీ ఇప్పటికీ కాలం చాలా మారింది.ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ కొత్త కొత్త హెయిర్ స్టైళ్లను ట్రై చేస్తున్నారు.

అయితే హెయిర్ స్టైళ్లతో గిన్నీస్ రికార్డులకు ఎక్కొచ్చా….? అంటే ఎక్కొచ్చని తాజాగా ఒక వ్యక్తి నిరూపించాడు.

తలపై ముళ్లలా కనిపించే మొహాక్ హెయిర్ స్టైల్ తో ఒక వ్యక్తి రికార్డులెక్కాడు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మొహాక్ హెయిర్ స్టైల్ ఈ వ్యక్తిదే కావడం గమనార్హం.

అమెరికాలోని మిన్నెసొటా ప్రాంతానికి చెందిన జోసెఫ్ గ్రిసామోర్ మొహాక్ లో ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు వల్ల స్థానం సంపాదించుకున్నాడు.జోసెఫ్ జుట్టు పొడవు ఏకంగా 42.5 ఇంచులు కావడం గమనార్హం.

ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు వల్ల జోసెఫ్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

దాదాపు 14 ఏళ్ల క్రితం నుండే రికార్డ్ సృష్టించాలనుకుని 2013 నుండి వర్కవుట్ చేసి అరుదైన రికార్డును జోసెఫ్ సొంతం చేసుకున్నాడు.తాను రోడ్లపై వెళుతున్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని… చాలామంది తన చుట్టూ మూగుతున్నారని… అయితే వాళ్లు పాజిటివ్ గానే స్పందిస్తున్నారని చెప్పారు.

ఈ రికార్డును వచ్చే సంవత్సరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేర్చబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube